Hyderabad: మందుబాబులకు జైలుశిక్ష..
ABN, Publish Date - Jul 12 , 2024 | 09:56 AM
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ 55 మందికి జైలుశిక్ష పడినట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్(City Traffic Additional CP Vishwaprasad) తెలిపారు.
- పదిరోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ 55 మందికి జైలుశిక్ష పడినట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్(City Traffic Additional CP Vishwaprasad) తెలిపారు. పది రోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 992 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించగా, 55 మందికి న్యాయస్థానం ఒకటి నుంచి 15 రోజుల జైలుశిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: BRS: గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మరో ఐదుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు జంప్?
మరో 8 మంది డ్రైవింగ్ లైసెన్స్(Driving license)లను 2 నుంచి 6 నెలలపాటు రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారి నుంచి జరిమానా రూపంలో రూ. 21.36 లక్షలు ఖజానాకు జమ అయినట్లు వెల్లడించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 12 , 2024 | 09:56 AM