ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అర్ధరాత్రి కాల్పుల కలకలం.. గాజులరామారంలో బార్‌ వద్ద ఘటన

ABN, Publish Date - Aug 29 , 2024 | 10:38 AM

గాజులరామారం(Gajularamaram) బుధవారం అర్ధరాత్రి కాల్పల మోతతో దద్దరిల్లింది. రెండు వర్గాలు తీవ్రంగా కొట్టుకోగా, రియల్‌ వ్యాపారి తన వద్ద ఉన్న తుపాకీతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. స్థానికులు, పోలీసుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బాచుపల్లి నుంచి ఓ మహిళ, యువకుడు కలిసి బైక్‌పై గాజులరామారం వైపు వస్తున్నారు.

- రెండువర్గాలు బాహాబాహీ, పలువురికి గాయాలు

- పోలీసుల పనితీరుపై స్థానికుల విమర్శలు

జీడిమెట్ల(హైదరాబాద్): గాజులరామారం(Gajularamaram) బుధవారం అర్ధరాత్రి కాల్పల మోతతో దద్దరిల్లింది. రెండు వర్గాలు తీవ్రంగా కొట్టుకోగా, రియల్‌ వ్యాపారి తన వద్ద ఉన్న తుపాకీతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. స్థానికులు, పోలీసుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బాచుపల్లి నుంచి ఓ మహిళ, యువకుడు కలిసి బైక్‌పై గాజులరామారం వైపు వస్తున్నారు. స్థానికంగా ఓ బార్‌ వద్దకు రాగానే వాహనంలో పెట్రోలు అయిపోయింది. దీంతో యువకుడు బార్‌ ముందు నిలిపి ఉంచిన రెండు వాహనాల్లో పెట్రోల్‌ తీస్తుండగా సిబ్బంది గుర్తించి కొట్టారు. దీంతో సదరు యువకుడి వెంట వచ్చిన మహిళ మల్లంపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, ఓ ఎమ్మెల్సీ అనుచరుడిగా పేరున్న నరేష్‌(Naresh)కు ఫోన్‌ చేయడంతో హుటాహుటిన నలుగురితో కలిసి బార్‌ వద్దకు వచ్చాడు.


రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి బాహాబాహికి దిగారు. ఆవేశంలో నరేష్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో బార్‌ సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) ఇద్దరు యువకులు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనపై పోలీసులు కిమ్మనకపోవడంపై స్ధానికంగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. అర్ధరాత్రి దాటినా బార్‌ తెరిచి ఉండడం గమనార్హం.


ఎమ్మెల్సీ అనుచరుడు నరేష్‌పై దర్యాప్తు చేయాలి..

అర్ధరాత్రి కాల్పులకు తెగబడిన ఎమ్మెల్సీ అనుచరుడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు మండల నరేష్‏పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకుడు సతీశ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో తమ కార్యకర్తలపై దాడి చేశాడని, మల్లంపేట కేవీఆర్‌ లేఅవుట్‌లోని పార్కు స్థలం కబ్జాలో నరేష్‌ పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఆయన భూకబ్జాలపై ఇప్పటికే కలెక్టర్‌, హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అక్రమ ఆయుధాలు కలిగిన నరేష్ తోపాటు అతడికి సహకరిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధిపై విచారణ జరపాలని సతీశ్‌ డిమాండ్‌ చేశారు.


................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................................

Hyderabad: ‘ఫీవర్‌’లో బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్‌

- వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌

హైదరాబాద్: డెంగీ, మలేరియా, డిఫ్తీరియా, చికున్‌గున్యా, వైరల్‌ జ్వరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌(RV Karnan) తెలిపారు. బుధవారం ఆయన నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి(Nallakunta Fever Hospital)ని తనిఖీ చేశారు. వార్డుల్లోకి వెళ్లి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. రోగులకిచ్చే మందులను పరిశీలించి వైరాలజీ, ఇతర ల్యాబ్‌లను సందర్శించారు. ల్యాబ్‌ సిబ్బంది పనితీరుపై కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ ఫీవర్‌ ఆస్పత్రికి వైరల్‌ ఫీవర్‌ బాధితులు అధికంగా వస్తున్నారని, డెంగీ కేసులు ఎక్కువగా రావడం లేదని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ బ్లడ్‌ స్టోరేజీ యూనిట్‌(Blood storage unit)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫీవర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జయలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల ఓపీకి నిత్యం 800 నుంచి 1100 మంది రోగులు వస్తున్నారని, డెంగీ కేసులు తక్కువ నమోదవుతున్నట్లు తెలిపారు. కమిషనర్‌ వెంట డీఎంహెచ్‌వో వెంకటి, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నరేందర్‌ తదితరులు ఉన్నారు


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2024 | 10:40 AM

Advertising
Advertising