ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గంజాయి మత్తులో హల్‌చల్‌.. వరుసకు తమ్ముడు, తల్లిపై గొడ్డలితో దాడి

ABN, Publish Date - Aug 28 , 2024 | 09:56 AM

గంజాయి, మద్యం మత్తులో ఓ వ్యక్తి కాలనీలో హల్‌చల్‌ చేశాడు. వరుసకు తమ్ముడుపైనా, అతడి తల్లిపైన గొడ్డలి, స్టీల్‌ రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో కిందపడి కొట్టుకుంటున్న వారి బాధలను సుమారు గంట పాటు అక్కడే ఉండి చూస్తూ రాక్షసానందం పొందాడు.

- ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

హైదరాబాద్: గంజాయి, మద్యం మత్తులో ఓ వ్యక్తి కాలనీలో హల్‌చల్‌ చేశాడు. వరుసకు తమ్ముడుపైనా, అతడి తల్లిపైన గొడ్డలి, స్టీల్‌ రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో కిందపడి కొట్టుకుంటున్న వారి బాధలను సుమారు గంట పాటు అక్కడే ఉండి చూస్తూ రాక్షసానందం పొందాడు. ఈదాడిలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్‌ డివిజన్‌(Balanagar Division) పరిధి దామోదర సంజీవయ్య కాలనీలో నివాసముండే ఏర్పుల రాజమల్లయ్య చిన్న కుమారుడు ముఖేందర్‌ (42) ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష


అదే బస్తీలో ఉండే ఏర్పుల మధు అతడికి వరుసకు అన్నయ్య. స్థానికంగా ఉన్న నల్లపోచమ్మ ఆలయ వ్యవహారం, ఆస్తి విషయాల్లో వారి కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు భార్య వదిలి వెళ్లడంతో మధు మద్యం, గంజాయిలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. మంగళవారం ఉదయం మద్యం, గంజాయి తాగిన మధు ఆ మత్తులో అందరినీ చంపేస్తాననని గొడ్డలితో కాలనీలో హల్‌చల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు.


అతడి అరుపులు విన్న ముఖేందర్‌(Mukhender) ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ముఖేందర్‌ను చూసిన మధు అతడిని గొడ్డలితో తలపై కొట్టాడు. కొడుకు అరుపులు విన్న తల్లి సావిత్రి బయటకు రాగా, ఆమెపై కూడా దాడి చేశాడు. రక్తపు మడుగులో వారు పడుతున్న బాధను చూస్తూ రాక్షసానందం పొందాడు. ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుంచి మధు పారిపోయాడు. ముఖేందర్‌, సావిత్రిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడంతో ముఖేందర్‌ మృతి చెందాడు.


సావిత్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి(Secunderabad KIM'S Hospital)కి తరలించారు. మధును బాలానగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు పాతకక్షలు కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అని విచారిస్తున్నారు. కాగా, మృతుడు ముఖేందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 09:56 AM

Advertising
Advertising
<