Hyderabad: కిడ్నాప్ చేసి నదిలో పడేశారు..
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:20 AM
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తిని హత్యచేసి నదిలో పడేశారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.
- ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య
- ఐదుగురి అరెస్ట్
- పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తిని హత్యచేసి నదిలో పడేశారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి(Medical DCP Kotireddy) వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంకు చెందిన కోయ వెంకటప్పన్నరెడ్డి (54), చిత్తూరు జిల్లా, కలకారి మండలానికి చెందిన రాంనారాయణరెడ్డి కుమారుడు బత్తిన ద్వారకానాథ్‌రెడ్డి (48) నాలుగేళ్లుగా స్నేహితులు.
ఈ వార్తను కూడా చదవండి: GHMC: జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో గందరగోళం...
వీరు 2021-22 సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్‌లో క్యాటరింగ్, క్లీనింగ్ కాంట్రాక్టులు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ద్వారకానాథ్‌రెడ్డి, వెంకటప్పన్నకు రూ. 28 లక్షలు ఇవ్వాల్సి ఉండడంతో పరారయ్యాడు. వెంకటప్పన్నరెడ్డి కుటుంబ సమేతంగా నగరానికి వచ్చి ఆల్విన్‌కాలనీ ప్రాంతంలోని తూర్పుసాయినగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలానగర్(Balanagar)లోని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో ఏజీఎంగా ఉద్యోగంలో చేరాడు. ద్వారకానాథ్‌రెడ్డి తిరుపతిలో ఉంటున్నాడని గుర్తించిన వెంకటప్పన్న రెడ్డి కుటుంబంతో కలిసి ఆయన దగ్గరకు వెళ్లి 28 లక్షలు ఇవ్వాలని గట్టిగా అడగటంతో చెక్కులు ఇచ్చాడు. ఈనెల 6న చెక్కులు డ్రా చేసుకోమన్నాడు.
అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో వెంకటప్పన్నరెడ్డిని వదిలించుకోవాలని ద్వారాకానాథ్ రెడ్డి పథకం పన్నాడు. దీనిలో భాగంగా కడప జిల్లా, వేంపల్లికి చెందిన బసిరెడ్డి సుధాకర్‌రెడ్డి(59)కి జరిగిన విషయం చెప్పాడు. అంతమొందించాలని పథకం పన్నిన వీరు కడపకు చెందిన ఎక్స్‌కవేటర్ డ్రైవర్ పాశం ప్రసాద్(36), కడప వల్లూరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ బూసుపాటి కిరణ్‌కుమార్(30), చెన్నూరుకు చెందిన పెయింటర్ గడ్డం వెంకట సుబ్బయ్య (25), టిప్పర్ డ్రైవర్ ఏ.మణికంఠ(25)తో కలిసి వెంకటప్పన్నను కిడ్నాప్ చేయడానికి రెండుసార్లు ప్రయత్నించారు. వీరి ప్రయత్నం ఫలించకపోవడంతో మూడోసారి ఈనెల 4వ తేదీ రాత్రి 7.45 గంటలకు డ్యూటీ నుంచి వస్తున్న అతడిని కూకట్‌పల్లి మైత్రినగర్ వద్ద అడ్డగించి, బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.
వెంటనే క్లోరోఫామ్ ఇవ్వడంతో స్పృహతప్పి పడిపోయా డు. కారును కొత్తకోట వైపు తీసుకెళ్లి మత్తులో ఉన్న వ్యక్తిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో విసిరి పారిపోయారు. భర్త డ్యూటీ నుంచి ఇంటికి రాకపోవడంతో భార్య హేమ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జగద్గిరిగుట్ట పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు అంగీకరించారు. ప్రధాన నిందితుడు బసిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు డీసీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ హన్మంతరావు, జగద్గిరిగుట్ట సీఐ కె.క్రాంతికుమార్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల
ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!
ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 08 , 2024 | 09:20 AM