Hyderabad: కంటి చికిత్సకొస్తే ప్రాణమే పోయింది..
ABN, Publish Date - Nov 23 , 2024 | 06:50 AM
కంట్లో కర్ర ముక్క గుచ్చుకొని ఆరేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే.. వైద్యులు మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో కన్నుమూసింది. ఈ ఘటన హబ్సిగూడలోని ఆనంద్ కంటి ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది.
- మత్తుమందు వికటించి ఆరేళ్ల చిన్నారి మృతి
- ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
హైదరాబాద్: కంట్లో కర్ర ముక్క గుచ్చుకొని ఆరేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే.. వైద్యులు మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో కన్నుమూసింది. ఈ ఘటన హబ్సిగూడలోని ఆనంద్ కంటి ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. నాచారం పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు(Thorrur) మండలం యుగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక దంపతులు పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడలో నివసిస్తున్నారు. రవి స్థానికంగా ఓ బోర్‌వెల్ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
వారి కుమార్తె హన్విక (6) ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది. వెంటనే చందానగర్‌లోని ఆనంద్ ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కంటి చుక్కల మందు ఇచ్చి ఇంటికి పంపించిన వైద్యులు.. కాసేపటికి ఫోన్ చేసి హబ్సిగూడలో ఉన్న తమ ఆస్పత్రి బ్రాంచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడ(Habsiguda)లోని ఆస్పత్రికి తీసుకరాగా, డాక్టర్లు ముక్కు ద్వారా మత్తుమందు ఇచ్చినట్లు తెలిసింది. మోతాదుకు మించడంతో చిన్నారి అపస్మారక స్థితికి వెళ్లింది.
పరిస్థితి విషమించడంతో విషయాన్ని దాచిపెట్టిన ఆస్పత్రి యాజమాన్యం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హుటాహుటిన ఎల్‌బీనగర్(LB Nagar)లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హన్విక కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు.
రెయిన్‌బో ఆస్పత్రి వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనంద్ హాస్పిటల్ డాక్టర్లను నిలదీశారు. రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించడంతో హన్విక కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మోతాదుకు మించి ఇచ్చిన మత్తుమందు వల్ల తమ కుమార్తె చనిపోయిందని రవి, మౌనిక దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 06:50 AM