Hyderabad: చీటింగ్‌లో మహాముదురు..

ABN, Publish Date - Sep 04 , 2024 | 10:53 AM

ఆర్థికంగా స్థిరపడాలని ఓ సినీ నిర్మాత మోసాలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల సైబరాబాద్‌(Cyberabad) పరిధిలో నలుగురితో కలిసి ఓ సంస్థకు రూ.40 కోట్ల మేర సైబర్‌ మోసం చేశాడు. ఇది వెలుగులోకి రాకముందే జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో ఖరీదైన ఇంటిని తన పేరిట సొంతం చేసుకునేందుకు పథకం వేశాడు.

Hyderabad: చీటింగ్‌లో మహాముదురు..

- సైబర్‌ ఫ్రాడ్‌ సొమ్ము ఇంటి కొనుగోలుకు చెల్లింపు

- గుర్తించి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేసిన అధికారులు

- సినీ నిర్మాత బషీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఆర్థికంగా స్థిరపడాలని ఓ సినీ నిర్మాత మోసాలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల సైబరాబాద్‌(Cyberabad) పరిధిలో నలుగురితో కలిసి ఓ సంస్థకు రూ.40 కోట్ల మేర సైబర్‌ మోసం చేశాడు. ఇది వెలుగులోకి రాకముందే జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో ఖరీదైన ఇంటిని తన పేరిట సొంతం చేసుకునేందుకు పథకం వేశాడు. చివరకు బెడిసికొట్టడంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ కింద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నం.12(Banjarahills Road No.12)కు చెందిన బినోతి మార్తాండ అమెరికాలో వైద్యురాలు. అక్కడే కుమారుడితో కలిసి నివాసముంటున్నారు.

ఇదికూడా చదవండి: Thummala: మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి తుమ్మల..


ఆమెకు జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌(Jubilee Hills Nandagiri Hills)లో సొంతిల్లు ఉంది. దీన్ని విక్రయించే బాధ్యతను మధ్యవర్తి గురునాథ్‌కి అప్పగించారు. 2022లో ఎస్‌బీకె ఫిల్మ్‌ అధినేత షేక్‌బషీర్‌ అలియాస్‌ బాబు ఆమెకు వాట్సప్‌ కాల్‌ చేసి ఇల్లు కొనుగోలు చేస్తానని చెప్పాడు. రూ.10 కోట్లకు బేరం కుదరడంతో ఇంటి కాగితాలను వాట్సప్‌ ద్వారా పంపించారు. ఆ తరువాత ఎందుకో బాబు ఫోన్‌ చేయలేదు. తిరిగి ఇటీవల ఫోన్‌ చేయగా ఇంటి ధర పెరిగిందని రూ.12.5 కోట్లకు అమ్ముతానని బినోత్‌ చెప్పడంతో సరే అని పలు దఫాలు ఆమె బ్యాంకు ఖాతాకు రూ.11 కోట్లు పంపించాడు. ఇంకా సుమారు రూ.3 కోట్లు బాకీ ఉన్నాడు. అప్పటికే బాబు ఇంటిని ఆక్రమించుకున్నాడు.


అసలు కథ ఇక్కడి నుంచే..

సైబర్‌ మోసం ద్వారా వచ్చిన డబ్బు బినోతి ఖాతాలోకి మళ్లినట్టు బ్యాంకు అధికారులు గుర్తించి ఖాతాను స్తంభింపజేశారు. ఆందోళన చెందిన ఆమె బాబును సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. జూలై 28న కుమారుడితో కలిసి నగరానికొచ్చిన ఆమె ఇంటికెళ్లి చూడగా అప్పటికే బాబు పూర్తిగా ఇంటిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతడిని సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలం కావడంతో మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా మరో నేరం గురించి పోలీసులకు తెలిసింది. ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన రూ.40 కోట్లను బాబు మరో నలుగురితో కలిసి కొట్టేశాడు. అందులో తన వాటా డబ్బుతో ఇల్లు కొనుగోలు చేసినట్టు విచారణలో ప్రాథమికంగా తేలింది.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...................................................................

Hyderabad: నిర్విరామంగా ఆపరేషన్‌ ధూల్‌పేట్‌

- 53 రోజులుగా కొనసాగుతున్న ఎక్సైజ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ సిటీ: గంజాయిని అంతం చేయడమే తమ పంతం అన్నట్లుగా ఆపరేషన్‌ ధూల్‌పేట్‌(Operation Dhulpet) నిర్విరామంగా కొనసాగుతోంది. జూలై 17న 12 స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) టీమ్‌లతో 24/7 రంగంలోకి దిగిన ఎక్సైజ్‌ పోలీసులు.. 53 రోజులుగా ఆకస్మిక దాడులు చేస్తూ.. గంజాయి స్మగ్లర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, హైదరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రీ(Hyderabad Deputy Commissioner KAB Shastri), అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌లు ఈ దాడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.


నియంత్రణే లక్ష్యం..

ధూల్‌పేటలో గంజాయి మహమ్మారిని నియంత్రించడమే లక్ష్యంగా ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దూకుడు పెంచారు. ఆపరేషన్‌ ధూల్‌పేట పేరుతో గల్లీగల్లీలో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారు. గంజా యి కట్టడితో పాటు.. డ్రగ్స్‌ నియంత్రణకు నడుం బిగించారు. అందులో భాగంగానే ఇటీవల పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, రేవ్‌పార్టీలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. 53 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా ఇప్పటి వరకు 34 కేసులు నమోదు చేసిన పోలీసులు.. 66 మంది స్మగ్లర్స్‌ను కటకటాల్లోకి నెట్టారు. మరో 33 మందిని బైండోవర్‌ చేశారు. అరెస్టయిన వారి నుంచి 2.7 క్వింటాళ్ల గంజాయి, 4.2 లీటర్ల హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ లీడర్‌ ఎన్‌. అంజిరెడ్డి తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2024 | 10:53 AM

Advertising
Advertising