ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మంగళ్‌హాట్‌లో వ్యక్తి దారుణ హత్య..

ABN, Publish Date - Oct 15 , 2024 | 07:48 AM

విజయదశమి సందర్భంగా బంధువులను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. మంగళ్‌హాట్‌(Mangalhat) పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టక్కర్‌వాడిలోని సత్య గులాబ్‌ రెసిడెన్షీలో నివసిస్తున్న దుర్గేష్‌ సింగ్‌(38) దసరా పండగ సందర్భంగా ఈనెల 13వ తేదీన సమీపంలోగల బంధువులను కలిసేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెళ్లాడు.

- ఆస్తి తగాదాల వల్లేనంటున్న బంధువులు

హైదరాబాద్: విజయదశమి సందర్భంగా బంధువులను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. మంగళ్‌హాట్‌(Mangalhat) పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టక్కర్‌వాడిలోని సత్య గులాబ్‌ రెసిడెన్షీలో నివసిస్తున్న దుర్గేష్‌ సింగ్‌(38) దసరా పండగ సందర్భంగా ఈనెల 13వ తేదీన సమీపంలోగల బంధువులను కలిసేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెళ్లాడు. కొంతకాలంగా దగ్గరి బంధువులైన బజరంగ్‌సింగ్‌, సత్యనారాయణసింగ్‌, తుల్జారాంసింగ్‌తో అతడికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. దుర్గేష్‌సింగ్‌(Durgesh Singh)పై గతంలో మూడుసార్లు దాడికి పాల్పడ్డారు. 13వ తేదీన బజరంగ్‌సింగ్‌, దుర్గేష్‌ సింగ్‌ మధ్య గొడవ జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Cyber Crime: లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ!


దుర్గేష్‌ స్నేహితులు ఇరువురిని సముదాయించి పంపించే ప్రయత్నం చేయగా.. బజరంగ్‌ అతడి ద్విచక్రవాహనం తాళాలు లాక్కున్నాడు. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు దుర్గే్‌షను స్నేహితులు బలవంతంగా ఇంటికి పంపించారు. వాహనం తాళాలు ఇవ్వమని బజరంగ్‌సింగ్‌ను వారు కోరగా.. దుర్గేష్ ను అప్పగిస్తేనే తాళాలు ఇస్తానని చెప్పాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత బజరంగ్‌.. దుర్గే్‌షకు ఫోన్‌ చేసి దుర్భాషలాడుతూ బెదిరించాడు. దుర్గేష్‌ విషయాన్ని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లగా బజరంగ్‌సింగ్‌, సత్యనారాయణసింగ్‌, తుల్జారాంసింగ్‌ అతడిపై దాడి చేసి విపరీతంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Hyderabad: ఇంకుడు గుంత లేకుంటే నోటీసులు

హైదరాబాద్‌ సిటీ: నీటి వినియోగదారులు తమ ఇళ్లల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోకపోతే వారికి నోటీసులు జారీ చేయాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Water Board MD Ashok Reddy) అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంత లేకపోతే జనవరి నుంచి ట్యాంకర్‌ బుక్‌ చేస్తే అదనపు చార్జీ వసూలు చేస్తామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు మెసేజ్‌ రూపంలో పంపించడంతో పాటు నేరుగా వారికి పత్రాలు అందజేయాలన్నారు.


సోమవారం ఖైరతాబాద్‌(Khairatabad)లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో 90రోజుల స్పెషల్‌ డ్రైవ్‌పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పెషల్‌ డ్రైవ్‌పై డాష్‌బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో సీవరేజీ ఓవర్‌ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్‌ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను, మీటర్ల క్యాన్‌ నంబర్లను జీపీఎస్‌ ఆధారంగా గూగుల్‌ మ్యాప్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఫిర్యాదులు వచ్చిన, పరిష్కరించిన వాటి వివరాలను ఆ మ్యాప్‌లో బబుల్‌ (బుడగ) లా కనిపించేలాగా ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి.. ఆ బబుల్‌ పరిమాణం మారుతుందని చెప్పారు.


ఈ ఏర్పాటు వల్ల సమస్య తీవ్రతను బట్టి అధికారులు దాన్ని పరిష్కరించే వీలుందన్నారు. మ్యాన్‌హోళ్లు, డీసిల్టింగ్‌ వివరాలను రోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ఎండీ సూచించారు. స్పెషల్‌ డ్రైవ్‌పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడిందన్న ఆయన.. పనితీరు కనబరిచిన సిబ్బందిని, అధికారులను అభినందించారు. సమావేశంలో డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌, స్వామి, విజయరావు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ఇదికూడా చదవండి: Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ఇదికూడా చదవండి: Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2024 | 07:49 AM