Hyderabad: మారణాయుధాలతో బెదిరించి.. నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
ABN, Publish Date - Dec 13 , 2024 | 08:33 AM
మారణాయుధాలతో నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతడిని బెదిరించి 2 కిలోల బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్(Domala guda Police Station) పరిధిలోని అరవింద కాలనీలో జరిగింది.
- 2 కిలోల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్: మారణాయుధాలతో నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతడిని బెదిరించి 2 కిలోల బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్(Domala guda Police Station) పరిధిలోని అరవింద కాలనీలో జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, వ్యాపారి వద్ద పనిచేస్తున్న కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన బంగారు నగల వ్యాపారి రంజిత్ గౌరాయ్(55) ఐదేళ్లుగా దోమలగూడ అరవిందకాలనీలో ఉంటున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: రంగనాథ్ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
ఇతడు నగరంలోని వివిధ జువెల్లరీ షాపుల నుంచి ఆర్డర్ తీసుకొని, వాటికి తగిన విధంగా బంగారు నగలు తయారు చేయించి సరఫరా చేస్తుంటాడు. ఇతని వద్ద దాదాపు 40 నుంచి 50 మంది నిపుణులైన కార్మికులు పనిచేస్తుంటారు. గురువారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రంజిత్ గౌరయ్ ఇంటి తలుపులు కొట్టారు. తలుపు తెరిచిన వెంటనే ఒక్కసారిగా కత్తులు మారాణాయుధాలు చూపించి ఇంట్లోకి చొరబడ్డారు.
రంజిత్ గౌరయ్(Ranjit Gauray)తోపాటు ఇంట్లో ఉన్న వారిని మారణాయుధాలు చూపించి, బెదిరించి లాకర్‌లో ఉన్న రెండు కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడు రంజిత్ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా రంజిత్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను దోమలగూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 08:33 AM