Hyderabad: ఫేస్‌బుక్‌లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి
ABN, Publish Date - Jun 11 , 2024 | 10:21 AM
నగరానికి చెందిన ఓ డాక్టర్ (బేరియాట్రిక్ సర్జన్)ను ఫేస్‌బుక్(Facebook)లో పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.41.28లక్షలు కొల్లగొట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సిటీ: నగరానికి చెందిన ఓ డాక్టర్ (బేరియాట్రిక్ సర్జన్)ను ఫేస్‌బుక్(Facebook)లో పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.41.28లక్షలు కొల్లగొట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేరియాట్రిక్ సర్జన్‌కు ఫేస్‌బుక్‌లో ఒక గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల తర్వాత కాయిన్ మార్కెట్ డాట్ విన్ అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ గురించి డాక్టర్‌కు వివరించాడు. ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. డాక్టర్ అతను చెప్పిన వ్యాలెట్లలో డబ్బులు జమచేసేవాడు. కొద్దిరోజులు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించిన నేరగాడు.. మంచి లాభాలు వచ్చినట్లు నమ్మించాడు. అనంతరం అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టించి విత్‌డ్రా ఆప్షన్‌ను, లాభాలు వచ్చినట్లు చూపించే ఆప్షన్ సైతం క్లోజ్ చేశాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: పబ్‌లో కొత్త రకం దందా.. ‘వలపు’ వల విసిరి దోపిడీ
దాంతో డాక్టర్ ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో భాగంగా నేరస్థుని ఈ వ్యాలెట్ల గురించి, కోల్పోయిన డబ్బును దక్కించుకునేందుకు సెర్చ్ చేస్తుండగా.. మరో గుర్తుతెలియని వ్యక్తి తారసపడ్డాడు. దాంతో అతని మాటలు నమ్మి మరికొంత పెట్టుబడి పెట్టాడు. అతను పంపిన ఈ వ్యాలెట్ అడ్ర్‌సను గుర్తించిన బాధితుడు ఇది కూడా మోసమేనని గుర్తించాడు. తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేసుకునే క్రమంలో బాధితుడు క్రిప్టో రికవరీ పేరుతో ఉన్న కీచ్ డీ గ్రేట్ అనే ఫిషింగ్ ఐట్‌కు కనెక్టయ్యాడు. అలా తను రెండోసారి రికవరీ చేసుకొని తన వ్యాలెట్‌లో ఉంచిన డబ్బును కోల్పోయాడు. అలా సైబర్ నేరగాళ్లు డాక్టర్ నుంచి మొత్తం రూ.41.28లక్షలు దోచేశారు. పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న డాక్టర్ చివరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 11 , 2024 | 10:23 AM