ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పాత ఫోన్లు కొంటారు.. సైబర్‌ నేరాలకు వాడేస్తారు!

ABN, Publish Date - Aug 22 , 2024 | 11:52 AM

పాత పేపర్లు, సామాన్లు, సెల్‌ఫోన్లు కొంటాం అంటూ.. బిహార్‌(Bihar) ముఠా సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పాతవి, పనిచేయని మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని సైబర్‌ నేరాలకు కేంద్రమైన జాంతారకు ఎగుమతి చేస్తున్నారు.

- బిహార్‌ ముఠా నయా దందా

- ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

- 4 వేల పాత సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్‌: పాత పేపర్లు, సామాన్లు, సెల్‌ఫోన్లు కొంటాం అంటూ.. బిహార్‌(Bihar) ముఠా సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పాతవి, పనిచేయని మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని సైబర్‌ నేరాలకు కేంద్రమైన జాంతారకు ఎగుమతి చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ పాత ఫోన్లు కొంటున్న బిహార్‌ ముఠాను పట్టుకోవడంతో సైబర్‌ నేరగాళ్ల గుట్టు రట్టయ్యింది.

ఇదికూడా చదవండి: Ranganath: బతుకమ్మకుంటను బతికిస్తాం...


ముగ్గురు నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు(Cyber ​​Security Police).. వారి నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 4 వేల పాత సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన సైబర్‌ నేరగాళ్ల వినూత్న వ్యూహం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఇలా చిక్కారు..

బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు గోదావరిఖని మేడిపల్లి ఎన్టీపీసీ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందింది. ఆ ముఠా పాతవి, పనిచేయని సెల్‌ఫోన్లను అతి తక్కువ మొత్తానికి, ప్లాస్టిక్‌ వస్తువులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. గోదావరిఖనిలో తనిఖీలు చేపట్టగా ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకున్నారు. పట్టుబడ్డ మహ్మద్‌ షమీమ్‌, అబ్దుల్‌ సలాం, మహ్మద్‌ ఇఫ్తికార్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది.


బిహార్‌కు చెందిన తాము పల్లెల్లో తిరుగుతూ పాతవి, పనిచేయని ఫోన్లు అతి తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి బిహార్‌లోని ముఠా సభ్యులకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ వీటికి అవసరమైన రిపేర్లు చేసి సైబర్‌ నేరాలకు కేంద్రమైన జాంతార, దేవగఢ్‌లోని సైబర్‌ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం వారి నుంచి ఎగుమతికి సిద్ధంగా మూడు సంచుల్లో దాచిన సుమారు 4 వేల పాత సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అక్తర్‌ అలీ కోసం గాలింపు చేపట్టారు. మదర్‌ బోర్డు మార్చి, చిన్న చిన్న రిపేర్లు, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాత ఫోన్లను నిందితులు సైబర్‌ నేరాలకు ఉపయోగిస్తారని.. గుర్తుతెలియని వ్యక్తులకు పాత ఫోన్లు విక్రయించొద్దని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌ శిఖాగోయల్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2024 | 11:52 AM

Advertising
Advertising
<