ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: దయచేసి అమ్మను చంపొద్దు...

ABN, Publish Date - Jun 15 , 2024 | 10:58 AM

పట్టపగలే మహిళ హత్య జరిగింది. తమ్ముడి అప్పుకు జామీనుగా ఉండి డబ్బులివ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు. చందానగర్‌(Chandanagar) పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఠాగూర్‌ విజయలక్ష్మి(40) జీవనోపాధి కోసం నగరానికి వలసొచ్చి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-1 లో నివాసం ఉంటోంది.

- కనికరించని ఆటోడ్రైవర్‌

- కత్తితో మెడపై పొడిచి మహిళ దారుణ హత్య

దయచేసి అమ్మను ఏమీ చేయవద్దని కొడుకు వేడుకుంటున్నా ఆగలేదు. కోపంతో ఊగిపోయాడు. కుమారుడి కళ్లెదుటే మహిళను కత్తితో పొడిచి చంపేశాడో ఆటోడ్రైవర్‌.

హైదరాబాద్: పట్టపగలే మహిళ హత్య జరిగింది. తమ్ముడి అప్పుకు జామీనుగా ఉండి డబ్బులివ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు. చందానగర్‌(Chandanagar) పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఠాగూర్‌ విజయలక్ష్మి(40) జీవనోపాధి కోసం నగరానికి వలసొచ్చి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-1 లో నివాసం ఉంటోంది. ఆమె భర్త కూలీగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు రాహుల్‌సింగ్‌ టెన్త్‌ పాసయ్యాడు. రెండో కుమారుడు కార్తీక్‌ 8వ తరగతి చదువుతున్నాడు. విజయలక్ష్మి అపర్ణ సరోవర్‌ అపార్ట్‌మెంట్‌లోని ఇళ్లల్లో పనిచేస్తోంది. రోజూ లక్ష్మీవిహార్‌ నుంచి అపర్ణకు ఆటోలో వెళ్లివచ్చేది. రాకపోకల సమయంలో ఆటోడ్రైవర్‌ భరత్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది.

ఇదికూడా చదవండి: Minister Ponnam: ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్‌ బ్యాంకు ..


భరత్‌ ఫైనాన్స్‌ కూడా చేస్తుంటాడు. విజయలక్ష్మికి అవసరం ఉన్నప్పుడు పలుమార్లు డబ్బు అప్పుగా ఇచ్చాడు. విజయలక్ష్మి తిరిగి ఇచ్చేది. విజయలక్ష్మి తమ్ముడు సునీల్‌సింగ్‌కు ఫైనాన్స్‌పై భరత్‌ రెండు ఆటోలను ఇప్పించాడు. విజయలక్ష్మి జామీనుగా ఉంది. సునీల్‌సింగ్‌ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో గొడవలు మొదలయ్యాయి. తెల్లాపూర్‌లో ఉండే సునీల్‌సింగ్‌ అప్పు అసలు చెల్లించినప్పటికీ భరత్‌గౌడ్‌ ఇబ్బందులు పెడుతున్నాడని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సంగారెడ్డి కోర్టులో ఇటీవల జరిగిన లోక్‌అదాలత్‌లో కేసు రాజీ కూడా అయింది. ఈక్రమంలో విజయలక్ష్మి ఇళ్లలో పనిచేయడానికి శుక్రవారం వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-1లో నివాసం ఉండే విజయలక్ష్మి ఇంటికి భరత్‌గౌడ్‌ వెళ్లాడు. ఆమె వచ్చేటప్పటికీ విజయలక్ష్మి ఇంటి వద్ద భరత్‌గౌడ్‌ ఉన్నాడు.


అతడిని చూసిన విజయలక్ష్మి ఇక్కడికి ఎందుకువచ్చావ్‌ వెళ్లిపోవాలని చెప్పడంతో భరత్‌గౌడ్‌ కోపంతో ఊగిపోయాడు. తలుపులు తీసి విజయలక్ష్మి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వెనుక నుంచి భరత్‌గౌడ్‌ కత్తితో మెడపై పొడిచాడు. దీంతో ఆమె కుప్పకూలింది. ఇదంతా విజయలక్ష్మి కుమారుడు రాహుల్‌ కళ్ల ముందే జరిగింది. తల్లిని ఏమీ చేయవద్దని రాహుల్‌ వేడుకుంటున్నా వినకుండా భరత్‌గౌడ్‌ కత్తితో పొడిచాడు. ఆపే ప్రయత్నంలో రాహుల్‌ చేతులకు గాయాలు అయ్యాయి. విజయలక్ష్మి అక్కడికక్కడే చనిపోవడంతో ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే రాహుల్‌ను కూడా చంపేస్తానని బెదిరించి తలుపులకు గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. భరత్‌గౌడ్‌ వెళ్లిన తర్వాత రాహుల్‌ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 10:58 AM

Advertising
Advertising