ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పాత కక్షలతోనే రియాజ్‌ హత్య..

ABN, Publish Date - Aug 15 , 2024 | 10:02 AM

తనను చంపేస్తాడేమో అన్న భయంతో ప్రత్యర్థి హత్యకు ప్లాన్‌ చేశాడు. అతడిని చంపేయాలని ఓ గ్యాంగ్‌కు రూ.13 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇదే అదునుగా హత్యను సంచలనం చేసి డాన్‌లుగా ఎదగాలని ఆ గ్యాంగ్‌ సభ్యులు పథకం వేశారు.

- రూ.13 లక్షలకు సుపారీ తీసుకున్న గోల్కొండ గ్యాంగ్‌

- గ్యాంగ్‌స్టర్లుగా ఎదగాలనే ఆరాటంతోనే హత్యకు అంగీకారం

- లఖ్‌నవూ నుంచి తుపాకీ, తూటాలు.. మొయినాబాద్‌ నుంచి కత్తులు, గొడ్డళ్లు

- నెల రోజుల నుంచే రెక్కీ

- ప్రతి కదలికను దుబాయి నుంచి పర్యవేక్షించిన ప్రధాన నిందితుడు

- కేసును ఛేదించిన పోలీసులు

- పరారీలో ముగ్గురు నిందితులు

హైదరాబాద్‌ సిటీ: తనను చంపేస్తాడేమో అన్న భయంతో ప్రత్యర్థి హత్యకు ప్లాన్‌ చేశాడు. అతడిని చంపేయాలని ఓ గ్యాంగ్‌కు రూ.13 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇదే అదునుగా హత్యను సంచలనం చేసి డాన్‌లుగా ఎదగాలని ఆ గ్యాంగ్‌ సభ్యులు పథకం వేశారు. పథకం ప్రకారం.. అతడిని దారుణంగా చంపేశారు. ఆ డాన్లు కటకటాలపాలయ్యారు. సూత్రధారి దుబాయ్‌లో ఉన్నాడు. వారం రోజల క్రితం బాలాపూర్‌(Balapur)లో జరిగిన రౌడీషీటర్‌ రియాజ్‌ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌తో కలిసి ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: నిలిచిన వైద్యసేవలు...


కంచన్‌బాగ్‌కు చెందిన ఖాజా రియాజుద్దీన్‌ చెప్పుల వ్యాపారి. స్థానికంగా అతడిపై రౌడీషీట్‌ నమోదైంది. ఈ నెల 8వ తేదీ రాత్రి రియాజుద్దీన్‌ బాలాపూర్‌ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అతడి బైక్‌ను ఢీకొట్టారు. కిందపడ్డ రియాజుద్దీన్‌ కళ్లల్లో కారం చల్లి, గొడ్డలితో నొదిటిపై నరికి, తుపాకీతో గుండెల్లో కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. అదే సమయంలో అటుగావెళ్తున్న అన్న సిరాజుద్దీన్‌ ఎక్కువ మంది జనం గుమికూడటంతో వెళ్లి చూడగా రియాజుద్దీన్‌(Riazuddin) రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. సిరాజుద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.


రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

హత్య కేసును ఛేదించేందుకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు.. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. హత్యకు పాతకక్షలే కారణమని గుర్తించారు. రియాజుద్దీన్‌ మరో సోదరుడు (తమ్ముడు) రియాసత్‌తో ఇతర వ్యక్తులకు పాతకక్షలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. రెండు నెలల క్రితం మీర్‌పేట పరిధిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వారిలో ఒక వర్గం తరఫున రియాజుద్దీన్‌ సోదరుడు రియాసత్‌, మరో వ్యక్తి తరఫున హమీద్‌ వకల్తాపుచ్చుకొని కొట్లాడుకున్నారు. ఈ గొడవ విషయంలో మీర్‌పేట పోలీస్‏స్టేషన్‌(Mirpet Police Station)లో రియాసత్‌పై కేసు నమోదైంది. రియాసత్‌ అన్న రియాజుద్దీన్‌కు రౌడీషీటర్‌గా పేరుండటంతో అతడి ద్వారా తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు హమీద్‌కు సమాచారం అందింది. భయాందోళనకు లోనైన హమీద్‌.. ఎలాగైనా రియాజుద్దీన్‌ను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. అందుకు స్నేహితుల ద్వారా పరిచయమైన సలీమ్‌, సుల్తాన్‌ గ్యాంగ్‌లను సంప్రదించాడు. రియాజుద్దీన్‌ను చంపేందుకు రూ.13లక్షలు సుపారీ ఇచ్చాడు.


తుపాకీతో కాల్చి చంపి డాన్‌లుగా ఎదగాలని..

రౌడీషీటర్‌గా పేరున్న రియాజుద్దీన్‌ను తుపాకీతో కాల్చి చంపితే పేరుమోసిన రౌడీషీటర్లుగా, డాన్‌లుగా ఎదగొచ్చని సుపారీ తీసుకున్న సలీమ్‌, సుల్తాన్‌ ప్లాన్‌ చేశారు. అందుకోసం తమ గ్యాంగ్‌లో స్నేహితులు, బంధువులైన మహ్మద్‌ గౌస్‌, ఇస్మాయిల్‌, అహ్మద్‌ అలియాస్‌ బాద్‌షా, సయ్యద్‌ ఇనయతుల్లా, తౌఫీక్‌ ఖాన్‌, షేక్‌ హుస్సేన్‌ అలియాస్‌ సల్మాన్‌లను చేర్చుకున్నారు. ప్రధాన నిందితుడు హమీద్‌కు ఉన్న పరిచయాల ద్వారా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖునవూలో ఫాజిల్‌, ఫరాజ్‌ అనే వ్యక్తుల నుంచి రూ. 40వేలు చెల్లించి తుపాకీ, బుల్లెట్స్‌ కొన్నారు. ఆ తర్వాత మొయినాబాద్‌లో రెండు గొడ్డళ్లు, కత్తి కొనుగోలు చేశారు. నెల రోజులపాటు రెక్కీ నిర్వహించి ఈనెల 8న రియాజుద్దీన్‌ను తుపాకీతో కాల్చి, గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యారు. డాన్‌లుగా ఎదగాలని చూసిన సుపారీ కిల్లర్స్‌ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.


దుబాయ్‌ నుంచి మానిటరింగ్‌..

రియాజుద్దీన్‌ మర్డర్‌కు స్కెచ్‌ వేసిన తర్వాత హత్యకు ముందు హమీద్‌ దుబాయ్‌కు వెళ్లిపోయాడు. మర్డర్‌ జరిగేంత వరకు మినిట్‌ టు మినిట్‌ అక్కడి నుంచే మానిటరింగ్‌ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. హమీద్‌ చిక్కితే ఈ హత్య కేసులో ఇంకేదైనా కొత్తకోణం ఉందా..? అనేది తేలనుంది. హమీద్‌తో పాటు తుపాకీ అమ్మిన నిందితులు పరారీలో ఉన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 10:02 AM

Advertising
Advertising
<