ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అర్ధరాత్రి దారికాచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల వద్ద దోపిడీ..

ABN, Publish Date - May 31 , 2024 | 11:40 AM

మద్యం మత్తులో ఆరుగురు పాత నేరస్తులు అర్ధరాత్రి క్యాబ్‌ను అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల(Software employees) వద్ద దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‏స్టేషన్‌(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది.

- అడ్డుకున్న క్యాబ్‌ డ్రైవర్‌పై బ్లేడ్‌తో దాడి

హైదరాబాద్: మద్యం మత్తులో ఆరుగురు పాత నేరస్తులు అర్ధరాత్రి క్యాబ్‌ను అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల(Software employees) వద్ద దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‏స్టేషన్‌(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్‌ కుమార్‌ (30) క్యాబ్‌డ్రైవర్‌. నానక్‌రాంగూడలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు క్యాబ్‌లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నెహ్రూనగర్‌కు తీసుకెళ్తున్నాడు.

ఇదికూడా చదవండి: Rachakonda CP: 30 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే.. ఆయుధ లైసెన్స్‌ రద్దు


నెహ్రూనగర్‌ ప్రధాన రహదారికి చేరుకోగానే పాత నేరస్తులు మున్నా అలియాస్‌ బుడ్డా, అఖిల్‌, రాజాసింగ్‌, మరో ముగ్గురు కారుకు అడ్డంగా వచ్చి దాడి చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సెల్‌ఫోన్లు, డబ్బులు, బంగారం దోచుకున్నారు. అడ్డు వచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌(30) మెడపై బ్లేడ్‌తో కోసి గాయపరిచారు. ప్రాణభయంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పరుగులు తీశారు. స్థానికులు గమనించి అనిల్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని బుడ్డా గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు. కాగా, జీడిమెట్ల పోలీసుల అసమర్ధతతోనే రౌడీలు, ఆకతాయిలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 11:40 AM

Advertising
Advertising