ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బంగారం షాపులో దృష్టి మళ్లించి దోపిడీ

ABN, Publish Date - Nov 27 , 2024 | 09:52 AM

వినియోగదారులుగా బంగారం షాపు(Gold shop)నకు వచ్చి సేల్స్‌మన్‌ కన్నుగప్పి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఓ మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లిజోన్‌ ఏసీపీ శ్రీనివాసరావు(Kukatpally Zone ACP Srinivasa Rao) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- నిందితురాలి అరెస్టు

హైదరాబాద్: వినియోగదారులుగా బంగారం షాపు(Gold shop)నకు వచ్చి సేల్స్‌మన్‌ కన్నుగప్పి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఓ మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లిజోన్‌ ఏసీపీ శ్రీనివాసరావు(Kukatpally Zone ACP Srinivasa Rao) తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్‌లోని గోకుల్‌టవర్స్‌కు చెందిన పుట్టా సునీత(41) ఈనెల 23న కేపీహెచ్‌బీకాలనీ రోడ్‌ నంబర్‌-1 లోని దేవి జువెల్లెర్స్‌కు నగలు కోనేందుకని వచ్చింది. ముఖానికి మాస్క్‌ ధరించి నగలు చూపించాల్సిందిగా సేల్స్‌మన్‌ను కోరింది.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: అన్నదమ్ముల వక్రమార్గం.. డబ్బు కోసం వారు చేసిన పనేంటో తెలిస్తే..


నగలు చూపిస్తుండగా అతని దృష్టి మరల్చి బంగారు నగలు దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత నగలు పోయినట్లుగా గుర్తించిన షాప్‌ యజమాని కేపీహెచ్‌బీ(KPHB) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా చోరీకి పాల్పడ్డ సునీతను పాత నేరస్థురాలిగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పుట్టా సునీతను మంగళవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.2,90,000 విలువైన 73 గ్రాముల బంగారు నెక్లె్‌సను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 09:52 AM