ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. రౌడీషీటర్‌కు జైలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 09:58 AM

మద్యం మత్తులో అక్కాచెల్లెళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి చేసిన రౌడీషీటర్‌(Rowdy sheeter)కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

హైదరాబాద్: మద్యం మత్తులో అక్కాచెల్లెళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి చేసిన రౌడీషీటర్‌(Rowdy sheeter)కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Jubilee Hills Police Station) పరిధిలో బాలిక తన సోదరి, తల్లితో కలిసి ఓ ఇంట్లో నివాసముంటుంది. 2019 మే 26 అక్కాచెల్లెళ్లు తన స్నేహితురాలు ఇంట్లో ఉండగా పక్కనే ఉండే రౌడీషీటర్‌ కొడాలి లక్ష్మణ్‌ అలియాస్‌ లచిల్‌ మద్యం మత్తులో వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయాన్ని తల్లికి చెప్పేందుకు ఫోన్‌ చేస్తుండగా దాన్ని లాక్కొని పగులకొట్టాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కూతురి ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్లయింది..


అనంతరం బాలికను కడుపుపై కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక సోదరిపై సైతం చెయి చేసుకుని, వారి స్నేహితురాలిని బెదిరించడంతో పాటు దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో బాలిక రహ్మత్‌నగర్‌లోని అప్పటి ఔట్‌పోస్టు వెళ్లి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ రామకృష్ణ లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 09:58 AM