ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.లక్షకు 18 రోజుల చిన్నారి విక్రయం

ABN, Publish Date - Jul 13 , 2024 | 01:30 PM

డబ్బు మీద మమకారంతో కన్నప్రేమను మరిచాడో తండ్రి. తన రక్తం పంచుకు పుట్టిన కుమార్తె (18 రోజుల శిశువును)ను రూ.లక్షకు విక్రయించేశాడు. తనకు సహకరించకపోతే విడాకులిస్తానని భార్యను బెదిరించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

- విడాకులిస్తానని భార్యను బెదిరించి కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి..

- తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి

- తల్లి చెంతకు చేరిన బిడ్డ

- తండ్రి సహా నలుగురి అరెస్టు

హైదరాబాద్: డబ్బు మీద మమకారంతో కన్నప్రేమను మరిచాడో తండ్రి. తన రక్తం పంచుకు పుట్టిన కుమార్తె (18 రోజుల శిశువును)ను రూ.లక్షకు విక్రయించేశాడు. తనకు సహకరించకపోతే విడాకులిస్తానని భార్యను బెదిరించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహ్మద్‌నగర్‌కు చెందిన అస్మాబేగం, ఆసిఫ్‌ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు(6) ఉండగా ఇటీవల కుమార్తె జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆసిఫ్‌ అప్పుడే పుట్టిన తన కుమార్తెను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు భార్య అంగీకరించకపోవడంతో విడాకులిస్తానని బెదిరించి ఒప్పించాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌పై కొరడా..


అనంతరం తన బంధువైన చాంద్‌ సుల్తానా(Chand Sultana)తో శిశు విక్రయం కోసం మాట్లాడుతుండగా వారి పక్కింటి వ్యక్తి పాషా విషయం తెలుసుకున్నాడు. కర్ణాటకలో ఉండే తన సోదరుడు మిలాన్‌ సాబ్‌కు పిల్లలు లేరని, అతనికి శిశువును ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆసిఫ్‌ అంగీకరిచడంతో కర్ణాటక నుంచి హైదరాబాద్‌ వచ్చిన మిలాన్‌ సాబ్‌ రూ.లక్ష చెల్లించి 18రోజుల శిశువును తీసుకెళ్లిపోయాడు. అయితే, కన్నబిడ్డ దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆస్మాబేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిలాన్‌సాబ్‌ను హైదరాబాద్‌కు రప్పించిన పోలీసులు చిన్నారిని కన్నతల్లి బేగంకు అప్పగించారు. ఆసిఫ్‌, సుల్తానా, పాషా, మిలాన్‌సాబ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<