Hyderabad: ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ భార్య ఆత్మహత్య..
ABN, Publish Date - Sep 10 , 2024 | 10:33 AM
తల్లి మరణించిన నాటి నుంచి మానసికస్థితి సరిగా లేక తీవ్ర మనోవేదనకు గురైన ఎస్‌బీఐ బ్యాంకు ఓ మేనేజర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బేగంపేటలోని ఎయిర్‌లైన్స్ కాలనీ(Airlines Colony)లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: తల్లి మరణించిన నాటి నుంచి మానసికస్థితి సరిగా లేక తీవ్ర మనోవేదనకు గురైన ఎస్‌బీఐ బ్యాంకు ఓ మేనేజర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బేగంపేటలోని ఎయిర్‌లైన్స్ కాలనీ(Airlines Colony)లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన హరీష్ జి.ప్రభు రంజితపి.మలీయా(37) దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరిష్ జి.ప్రభు ఎస్‌బీఐలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: జీహెచ్‌ఎంసీకి రూ.10,500 కోట్లు ఇవ్వండి
ఇటీవల అతనికి హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఫ్యామిలీతో నగరానికి వచ్చి బేగంపేటలోని ఎయిర్‌లైన్స్ కాలనీలోని కోరల్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భార్య తల్లి మరణించింది. దీంతో రంజిత పి.మలీయా తీవ్రమనోవేదనతో అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు హరీష్ జీ.ప్రభు బ్యాంకుకు వెళ్లారు. కొద్ది సేపటికే అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు ఫోన్ చేసి మీ భార్య భవనంపై నుంచి పడి చనిపోయిందని చెప్పడంతో ఇంటికిచేరుకున్నారు.
భవనం ఆరో అంతస్థు పైన ఉన్న టెర్రా్‌సపై నుంచి క్రింద పడడంతో రంజితపి.మల్లీయా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
...................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.....................................................................
MLA: రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి..
- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA Sabitha Indra Reddy) డిమాండ్ చేశారు. సోమవారం జల్‌పల్లి మున్సిపాలిటీలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 128మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు తాను చేసిన శంకుస్థాపన పనుల వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతూ పోజులు ఇవ్వడం సరికాదని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: CV Anand: గణేశ్ బందోబస్తు.. అసలైన ఫైనల్స్
కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి గతంలో రద్దు చేసిన రూ. 270 కోట్లు విధులను విడుదల చేయించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిర దేవి, ఆర్‌ఐ జమీల్, జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, బీఆర్‌ఎస్ నాయకులు, ఫాహమీద ఆఫ్జాల్, యూసుఫ్ పటేల్, శంషోద్దీన్, శంకర్, యాహియా, దస్తగిరి, జనార్దన్, ఇక్బాల్ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 10 , 2024 | 10:33 AM