ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాలంటూ మోసం..

ABN, Publish Date - May 26 , 2024 | 01:06 PM

జీహెచ్‌ఎంసీ(GHMC)లో కాంట్రాక్ట్‌ స్వీపర్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ 30 మంది వద్ద రూ. 10 లక్షలకు పైగా వసూలు చేసిన ఓ వ్యక్తిపై ఖైరతాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Khairatabad Police Station)లో కేసు నమోదైంది.

- ఐడీ కార్డులిచ్చి ఎన్నికల సమయంలో ఊడ్పించిన నిందితుడు

- 30 మంది నుంచి రూ.10 లక్షలు వసూలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ(GHMC)లో కాంట్రాక్ట్‌ స్వీపర్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ 30 మంది వద్ద రూ. 10 లక్షలకు పైగా వసూలు చేసిన ఓ వ్యక్తిపై ఖైరతాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Khairatabad Police Station)లో కేసు నమోదైంది. కార్మికులకు ఉద్యోగాలు వచ్చేశాయంటా వారి ఫొటోలతో జీహెచ్‌ఎంసీ గుర్తింపు కార్డులు వారికి అందించడమే కాక ఎన్నికల సమయంలో వారితో కొన్ని రోజులు రోడ్లను శుభ్రం చేయించాడంటూ మహిళలు మొర పెట్టుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆసి్‌ఫనగర్‌కు చెందిన సాయికుమార్‌ అనే వ్యక్తి తనకు జీహెచ్‌ఎంసీలో అధికారులతో సంబంధాలున్నాయని తెలుపుతూ తన స్నేహితుడి ద్వారా సికింద్రాబాద్‌కు చెందిన కళావతితో పరిచయం ఏర్పరచుకున్నా డు. ఆమె ద్వారా మరికొంత మందికి కాంట్రాక్టు స్వీపర్లుగా పనిలో చేర్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు వసూలు చేశాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: జూపార్కు నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ భేష్‌..


ఉద్యోగానికి అర్హత సాధించేలా చేసినందుకు రూ. 10వేలు, గుర్తింపు కార్డులు ఇచ్చే సమయంలో రూ. 15 వేలు, ఉద్యోగంలో చేరే సమయంలో మరో రూ. 15 వేలు ఇవ్వాలనే ఒప్పందం మేరకు చాలా మంది పూర్తి డబ్బులు ఇచ్చినట్టు మహిళలు తెలిపారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, నకిలీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన నిందితుడు ఉద్యోగంలో చేరాలని పేర్కొంటూ ఎన్నికల సమయంలో 4 రోజులు రవీంద్రభారతి వద్ద ఉదయం 6 నుంచి 9 వరకు రోడ్లను శుభ్రం చేయించి అక్కడ పనిచేసే వారు వచ్చేలోపు వారిని పంపించాడని మహిళలు ఆరోపించారు. ఉద్యోగాల్లో చేర్పించామని తెలపడమే కాక అందులో ఒకరిని సూపర్‌వైజర్‌గా, మరొకరిని సహాయకురాలిగా నియమించాడు. కళావతి తమకు వచ్చిన ఉద్యోగాలు నిజమేనా అని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విచారించగా గుర్తింపుకార్డులు నకిలీవని తేలడంతో ఖైరతాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 26 , 2024 | 01:06 PM

Advertising
Advertising