Hyderabad: బతుకుదెరువుకొచ్చి.. గంజాయితో పట్టుబడి..
ABN, Publish Date - Oct 03 , 2024 | 10:34 AM
బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఓ వ్యక్తి డబ్బు ఆశచూపించి వారితో గంజాయి సరఫరా చేయించాడు. పైసల కోసం ఆతృత పడిన ముగ్గురు కూలీలు విశాఖ నుంచి హైదరాబాద్(Hyderabad)కు గంజాయి సరఫరా చేసి చివరకు ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు.
- ఇతర రాష్ట్రాల కూలీలతో గంజాయి సరఫరా
- రోజుకు రూ.10 వేలిస్తామనడంతో ఒప్పుకోలు
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 60 కిలోలు పట్టివేత
- మరో ఘటనలో రూ.30 లక్షల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఓ వ్యక్తి డబ్బు ఆశచూపించి వారితో గంజాయి సరఫరా చేయించాడు. పైసల కోసం ఆతృత పడిన ముగ్గురు కూలీలు విశాఖ నుంచి హైదరాబాద్(Hyderabad)కు గంజాయి సరఫరా చేసి చివరకు ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన సైదులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన సుమన్‌సేన్, ఎండీ సోహెల్‌లు పొట్టచేత పట్టుకొని విశాఖకు వచ్చారు. అక్కడ పనికోసం ఆరా తీస్తుండగా స్థానికులు ఆకాశ్ వద్ద పని లభిస్తుందని సలహా ఇవ్వడంతో ఆయన వద్దకెళ్లారు.
ఇదికూడా చదవండి: AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..
ఇదే అదునుగా భావించిన ఆకాశ్.. ‘లగేజీ బ్యాగుల్లో గంజాయిని ప్యాకెట్లుగా నింపి ఇస్తా. ప్రయాణికుల్లా వెళ్లి హైదరాబాద్‌లో ఇచ్చి రావాలి. చెప్పిన పనిచేస్తే రోజుకు రూ.10వేలు ఇస్తా’ అని చెప్పడంతో వారు సరేనన్నారు. ఒక్కో లగేజీ బ్యాగులో 20 కేజీల చొప్పున గంజాయి ప్యాకెట్లు పార్సిల్ చేసి, వారిని విశాఖ నుంచి హైదరాబాద్‌కు పంపించాడు. గోదావరి ఎక్స్‌ప్రెస్(Godavari Express)లో గంజాయి సరఫరా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ (స్టేట్ టాస్క్‌ఫోర్స్) టీం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లో మాటువేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ.6 లక్షల విలువైన 60 కేజీల గంజాయి, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆకాశ్ పరారీలో ఉన్నాడు.
ఓ వైపు గంజాయి, మరో వైపు డ్రగ్స్..
ఓవైపు డ్రగ్స్, మరోవైపు గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 185 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం చెందిన రుషికేశ్వర్‌రావు కొన్నాళ్ల క్రితం కూకట్‌పల్లి వచ్చి వ్యాపారం చేసేవాడు. నష్టాలు రావడంతో డ్రగ్స్, గంజాయి సరఫరా చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా తెలిసిన స్మగ్లర్ల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు రుషికేశ్వర్‌రావు పట్టుకున్నారు.
మరో ఘటనలో..
కార్వాన్: సౌత్‌వె్‌స్టజోన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షలు విలువజేసే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ చంద్రమోహన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన హైమద్‌షేక్ (30), ఇర్ఫాన్‌షేక్ (30), మల్లేపల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ (32) గ్యాంగ్‌గా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ ముగ్గురితోపాటు ఒడిశాకు చెందిన గోవర్ధన్‌ను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి రూ.30 లక్షల విలువజేసే గంజాయి, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో నలుగురి రిమాండ్..
కొత్తపేట: ఎల్‌బీనగర్ గంజాయి కేసులో బుధవారం నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద జంటగా గంజాయి విక్రయిస్తున్న దంపతులను, గంజాయి కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ అనంతరం గుంటూరుకు చెందిన యాపర్తి గోపి, ఉమామహేశ్వరి దంపతులతోపాటు గంజాయి కొనుగోలు చేసిన ప్రభుచరణ్, నగేశ్‌లను రిమాండ్‌కు తరలించారు.
ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?
ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్ బెనిఫిట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 03 , 2024 | 10:34 AM