Hyderabad: భార్యను హత్య చేసిన భర్త.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి
ABN , Publish Date - May 25 , 2024 | 10:49 AM
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినా కేసు వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- కేసును గోప్యంగా ఉంచిన పోలీసుల తీరుపై అనుమానాలు
- నిందితుడికి రిమాండ్
హైదరాబాద్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినా కేసు వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం(Prakasam) జిల్లా, కనికమెట్ల మండలం, గోట్లగట్టు గ్రామానికి చెందిన రంగనాయకులు కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధులత(29)ను, అదే జిల్లా, దర్శి పట్టబజార్‌కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు సాప్ట్‌వేర్ ఇంజనీర్ నాగేంద్రభరద్వాజ్ (31) కు ఇచ్చి 2020 ఫిబ్రవరి 15వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వీరికి 17 నెలల శ్రీజ అనే కుమార్తె ఉంది. బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీ ఎంఎస్ఆర్ ప్లాజా బి.బ్లాక్ 101 ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రేపు, ఎల్లుండి 26 ఎంఎంటీఎస్, డెమోరైళ్లు రద్దు
వివాహం అయినప్పటి నుంచి నాగేంద్రభరద్వాజ్ భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం ఆమెను కొడుతుండేవాడు. భార్యతో ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. గర్భిణిగా ఉన్న సమయంలో గొడవలు జరగడంతో మధులత పుట్టింటి కి వెళ్లిపోయింది. నాగేంద్ర పెద్దలతో మాట్లాడి భార్యను తీసుకొచ్చాడు. కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన భార్యతో గొడవపడి కత్తితో కడుపులో పొడిచి హత్య చేశాడు. మెడ, శరీరంపై ఇతర భాగాల్లో కూడా కత్తితో పొడిచాడు. ముక్కలు చేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. సాధ్యం కాకపోవడంతో గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించిన బాచుపల్లి పోలీసులు ఈనెల 6వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నాగేంద్ర భరద్వాజ్‌ను కఠినం గా శిక్షించాలని మృతురాలి తండ్రి రంగనాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu Newshy