ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆటోలో ఎక్కించుకుంటారు.. ఫోన్‌ కొట్టేస్తారు

ABN, Publish Date - Aug 31 , 2024 | 12:48 PM

మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో ఒకే రోజు ఒకే తరహాలో ఆటోలో ముగ్గురి సెల్‌ఫోన్‌లు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన అజయ్‌ రెహ్మత్‌నగర్‌ సంతోష్‏గిరిలో నివాసం ఉంటూ వాల్‌పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.

- ఒకే రోజు ముగ్గురి సెల్‌ఫోన్లు చోరీ

హైదరాబాద్: మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో ఒకే రోజు ఒకే తరహాలో ఆటోలో ముగ్గురి సెల్‌ఫోన్‌లు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన అజయ్‌ రెహ్మత్‌నగర్‌ సంతోష్‏గిరిలో నివాసం ఉంటూ వాల్‌పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పని కోసం బ్రహ్మశంకర్‌నగర్‌ నుంచి యూసుఫ్‏గూడ బస్తీ వెళ్లేందుకు వచ్చాడు. అతడి ముందు ఓ ఆటో ఆగింది. వెనక సీట్లో ముగ్గురు కూర్చుని ఉన్నారు. డ్రైవర్‌ పక్కన కూర్చునేందుకు అజయ్‌ ప్రయత్నించాడు.


డ్రైవర్‌ ముందు టైర్‌లో గాలి తక్కువగా ఉంది వెనక కూర్చోమని చెప్పాడు. సరేనని వెనక సీట్లోకి వెళ్లాడు. కూర్చునేందుకు ఇబ్బందిగా ఉండడంతో కార్మికనగర్‌లో దిగాడు. సెల్‌ఫోన్‌ చూసుకోగా కనిపించలేదు. అలాగే, రెహ్మత్‌నగర్‌లో ఉండే సాయికిరణ్‌ యూసుఫ్‏గూడ చెక్‌పోస్టు(Yusuf Guda Checkpost) వద్దకు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తుండగా ఓ ఆటో ఆగింది. వెనక సీట్లో ముగ్గురు ఉన్నారు. వెనక కూర్చోవడం ఇబ్బందిగా ఉందని ఆటో దిగాడు. సెల్‌ఫోన్‌ చూసుకోగా కనిపించలేదు. రెహ్మత్‌నగర్‌లో ఉండే కోటి సత్యం మైత్రివనం వెళ్లేందుకు హెడీఎఫ్‏సీ ఏటీఎం(HDFC ATM) వద్ద ఆటో ఎక్కాడు.


వెనక సీట్లో ముగ్గురు ఉన్నారు. కొంతదూరం వెళ్లాక వెనక కూర్చోవడం ఇబ్బందిగా ఉందని ఆటో దిగాడు. సెల్‌ఫోన్‌ చూసుకోగా కనిపించలేదు. ఈ మూడు సంఘటనలు గురువారం ఉదయం 8.40 గంటల నుంచి 9 గంటలలోపు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎస్పీఆర్‌హిల్స్‌ నుంచి ఆటోలో వచ్చిన వారు సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 31 , 2024 | 12:48 PM

Advertising
Advertising