ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కారు పార్కింగ్‌లో పెట్టమన్నందుకు తుపాకీతో బెదిరింపు

ABN, Publish Date - Nov 09 , 2024 | 07:13 AM

కారు పార్కింగ్‌లో పెట్టాలని చెప్పినందుకు.. ‘నా కారునే ఆపుతావా’ అంటూ ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించిన ఘటన శుక్రవారం కూకట్‌పల్లి(Kukatpally) కోర్టు ప్రాంగణంలో జరిగింది. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు.

- కేసు నమోదు

హైదరాబాద్: కారు పార్కింగ్‌లో పెట్టాలని చెప్పినందుకు.. ‘నా కారునే ఆపుతావా’ అంటూ ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించిన ఘటన శుక్రవారం కూకట్‌పల్లి(Kukatpally) కోర్టు ప్రాంగణంలో జరిగింది. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన నరసింహ మియాపూర్‌ ప్రశాంతినగర్‌(Miyapur Prashanthinagar) కోర్టు, కూకట్‌పల్లి కోర్టు ప్రాంగణాల్లో గత నాలుగు నెలలుగా వెహికిల్‌ పార్కింగ్‌ కాంట్రాక్టును నిర్వహిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో రూ.15లక్షల విలువైన ఆభరణాలు చోరీ


ఈ క్రమంలో కూకట్‌పల్లి కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్‌ ప్రాంతంలోకి శుక్రవారం కియా కారు (ఏపీ39ఎఫ్‏క్యూ7117) వచ్చింది. దాన్ని పార్కింగ్‌లో పెట్టాలని నరసింహ చెప్పారు. అతని మాటలను లెక్కచేయని సదరు కారు యజమాని కారును కొంతదూరం పోనిచ్చి ఆపేశాడు. అక్కడికి నరసింహ(Narasimha)ను పిలిచి నా కారునే ఆపుతావా..? నేనెవరో తెలుసా అంటూ చేతిలోకి తుపాకీ తీసుకొని అతన్ని బెదిరించాడు.


అనంతరం కారును తనకు నచ్చిన చోటపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ హఠాత్పరిణామంతో షాకైన బాధితుడు విషయాన్ని కోర్టులోని లాయర్స్‌కు, బార్‌ కౌన్సిల్‌ మాజీ అధ్యక్షుడికి వివరించాడు. వారి సూచనమేరకు బాధితుడు నరసింహ కేపీహెచ్‌బీ పోలీసు(KPHB Police)లకు ఫిర్యాదు చేశాడు. తుపాకీతో బెదిరించిన వ్యక్తిని చిదంబరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆర్మ్‌ యాక్టు కింద కేసు నమోదు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 07:13 AM