Hyderabad: వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య..
ABN, Publish Date - Dec 17 , 2024 | 07:34 AM
మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajgiri Constituency) కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే సుంధీల్ సైంథల్(23) పెయింటర్. ఇతనికి సెంట్రింగ్ పనిచేసే షేక్ రహీల్(22), నరసింహ అలియాస్ నాని (21)తో స్నేహం ఉంది.
- మాయమవుతున్న మానవసంబంధాలు
- గంజాయి మత్తులో స్నేహితులే దాడి చేసి చంపేశారు
- మరో ఘటనలో సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిపై ఇద్దరు బ్రదర్స్ బాటిల్‌తో దాడి
- అక్కడికక్కడే మృతి
హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajgiri Constituency) కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే సుంధీల్ సైంథల్(23) పెయింటర్. ఇతనికి సెంట్రింగ్ పనిచేసే షేక్ రహీల్(22), నరసింహ అలియాస్ నాని (21)తో స్నేహం ఉంది. ఒకే ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు గంజాయితో పాటు మద్యానికి అలవాటు పడ్డారు. రాత్రి సమయాల్లో మద్యం, గంజాయి సేవించి తరుచుగా ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లోని స్థానికులతో గొడవ పడేవారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఆదివారం సైంథిల్ తన బంధువైన రాజ్‌కుమార్(Rajkumar)తో కలిసి ఇంట్లో మద్యం తాగుతూ రహీల్, నరసింహను సైతం ఆహ్వానించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
నలుగురు కలిసి ఇంట్లో పార్టీ చేసుకుంటుండగా పాతకక్షలు గుర్తుకు వచ్చాయి. దీంతో సైంథిల్ ఇంట్లోని కత్తితో దాడి చేయబోగా రహీల్, నరసింహలు అడ్డుకుని అదేకత్తితో ఎదురుదాడి చేశారు. విచక్షణరహితంగా సైంథిల్ కడుపు భాగంతో పొడవడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు షేక్ రహీల్, నరసింహ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు.
మరో ఘటనలో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి..
నేరేడ్‌మెట్: మరోఘటనలో సెల్‌ఫోన్ మిస్సింగ్ అయ్యిందంటూ ఇద్దరు అన్నదమ్ములు ఓ వ్యక్తితో ఘర్షణ పడి అతడిని హత్య చేశారు. గోకుల్‌నగర్ కాలనీలో నివసిస్తున్న హంస గణేష్(24), హంస నవీన్ అలియాస్ భగవాన్ దాస్(22) అన్నదమ్ములు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన బి.హంతు (55) నగరానికి వచ్చి గోకుల్‌నగర్‌లోనే ఉంటూ వంటమనిషిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన హంతు మూడునెలల నుంచి ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగిన హంతు శ్రీసాయినగర్ కాలనీ ఆర్చి పక్కన ఉన్న బిల్డింగ్ సెల్లార్లో పడుకున్నాడు.
అదే సమయంలో గణేష్ దాస్, భగవాన్‌దా్‌స అక్కడికి వచ్చిన కొద్దిసేపటికి తన ఫోన్ కనిపించడం లేదని, నీవే తీసుకున్నావని నిద్రపోతున్న హంతును లేపి గొడవపడ్డారు. అతడు ఎదురు తిరగడంతో అన్నదమ్ముల్లో ఒకరు బీరు బాటిల్‌తో, మరొకరు చెక్కతో హంతు తలపై కొట్టడంతో తీవ్రమైన గాయాలవడంతో కింద పడిపోయాడు. అనంతరం హంతు తలను నేలకేసి బాదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సందీ్‌పకుమార్ తెలిపారు. భగవాన్‌దా్‌స తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో 2021లో ఇంటి దొంగతనం కేసులో నేరస్థుడు.
ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News
Updated Date - Dec 17 , 2024 | 07:34 AM