ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వార్నీ.. ఇదేంపని... సెల్‌ఫోన్‌ దొంగలతో ఖాకీల దోస్తీ..

ABN, Publish Date - Jul 31 , 2024 | 10:31 AM

నేరాలను అడ్డుకోవాల్సిన ఖాకీలు దొంగలతో చేతులు కలిపారు. రెండేళ్లుగా దొంగలకు సహకరిస్తున్నారు. దొంగలముఠాతో కలిపి ఇప్పుడు ఆ పోలీసులు కూడా కటకటాలపాలయ్యారు. పంజాగుట్ట పోలీస్‏స్టేషన్‌(Panjagutta Police Station)లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.

- అంతర్రాష్ట్ర ముఠాతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌ అరెస్ట్‌

- 15 సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: నేరాలను అడ్డుకోవాల్సిన ఖాకీలు దొంగలతో చేతులు కలిపారు. రెండేళ్లుగా దొంగలకు సహకరిస్తున్నారు. దొంగలముఠాతో కలిపి ఇప్పుడు ఆ పోలీసులు కూడా కటకటాలపాలయ్యారు. పంజాగుట్ట పోలీస్‏స్టేషన్‌(Panjagutta Police Station)లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఈనెల 24న ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఓ యువకుడు మొబైల్‌ చోరీకి ప్రయత్నిస్తుండగా ప్రయాణికులు పట్టుకుని చితకబాదారు. పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడు పశ్చిమబెంగాల్‌కు చెందిన అలమిన్‌గాజి అలియాస్‌ జిడ్డీ నోనియా అని, ప్రస్తుతం ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాలో ఉంటున్నాడని తెలిసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: కొత్త బస్సులు సిద్ధం.. త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌లు


మరింత లోతుగా విచారణ చేపట్టగా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలమిన్‌గాజి వెనకాల అంతర్జాతీయ ముఠా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జార్ఖండ్‌ రాష్ట్రం(Jharkhand State)లోని తీన్‌పహార్‌ గ్రామానికి చెందిన రాహుల్‌ కుమార్‌యాదవ్‌ కొంతమందితో ముఠా ఏర్పాటు చేశారు. ఆ ముఠాలో అందరూ చిన్నపిల్లలే. వీరికి ముందే శిక్షణ ఇచ్చి సెల్‌ఫోన్లు ఎలా కొట్టేయాలో నేర్పిస్తారు. అనంతరం వీరిని చోరీలు చేసేందుకు హైదరాబాద్‌, సూరత్‌, లక్నో, రాంచీ, బేలూర్‌, చెన్నై(Hyderabad, Surat, Lucknow, Ranchi, Belur, Chennai), వారాణసీ, నాగ్‌పూర్‌, పాట్నా తదితర ప్రాంతాలకు పంపిసారు. సభ్యులు 50 సెల్‌ఫోన్లు జమచేసి యాదవ్‌కు ఇచ్చేవారు. సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు యాదవ్‌ విమానంలో వచ్చి, వెళ్లేటప్పుడు మాత్రం రైలులో వెళ్లేవాడు.


సెల్‌ఫోన్లతో వెళ్తే విమానాశ్రయాల్లో దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైలునే ఎంచుకునే వాడు. సెల్‌ఫోన్లు అమ్మాక అందరికీ డబ్బు పంపించేవాడు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ షాహనవాజ్‌ (39), జోనుకుమార్‌ (22), జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన గోవిందకుమార్‌ మహ్తో (32), జుగేశ్వర్‌ నోనియా (31), ఎండీ ముఖ్తార్‌షేక్‌ (28)లను అరెస్టు చేశారు. విచారణలో వీరికి ఖాకీల సహకారం అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఖాకీలతో పరిచయం ఇలా

హోంగార్డు అశోక్‌ రెండేళ్ల క్రితం ఎస్‌.ఆర్‌ నగర్‌ ఠాణాలో విధులు నిర్వహిస్తుండగా మహ్మద్‌ షాన వాజ్‌(39)ను మొబైల్‌ ఫోన్ల దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఎక్కడైనా ముఠా సభ్యులు పోలీసులకు చిక్కితే అశోక్‌ ద్వారా వారిని విడిపించేందుకు షానవాజ్‌ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుళ్లు సోమన్న, సాయిరామ్‌తో కూడా షానవాజ్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి. పోలీసులు ముగ్గురూ కలిసి సెల్‌ఫోన్‌ దొంగల ముఠాకు సహకరించేవారు. వీరిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న జార్ఖండ్‌ సాహెబ్‌గంజ్‌ జిల్లా టిన్‌పహార్‌ గ్రామానికి చెందిన కాంచన్‌ నోనియా(34), షాను(25), ఒక మైనర్‌ బాలుడు, ముఠా నాయకుడు రాహుల్‌ కుమార్‌ యాదవ్‌(30), రింకు, షామీమ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 10:31 AM

Advertising
Advertising
<