Hyderabad: 2 కిలోల బంగారు నగల చోరీ ఇంటి దొంగల పనేనా..
ABN, Publish Date - Dec 14 , 2024 | 10:17 AM
బంగారు నగల చోరీ కేసులో ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున అరవింద్‌నగర్ కాలనీ(Arvindnagar Colony)లో కత్తులు, తుపాకులతో బెదిరించి రెండు కిలోల బంగారు నగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
- వర్కుషాపులోని 40 మంది కార్మికుల కాల్‌డేటా సేకరణ
- ఐదు పోలీసు బృందాలతో నిందితుల కోసం గాలింపు
హైదరాబాద్: బంగారు నగల చోరీ కేసులో ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున అరవింద్‌నగర్ కాలనీ(Arvindnagar Colony)లో కత్తులు, తుపాకులతో బెదిరించి రెండు కిలోల బంగారు నగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన దోమలగూడ పోలీసులు ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం... యజామని రంజిత్‌గౌరాయ్ సోదరుడైన ఇంద్రజిత్‌గౌరాయ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బంతి కోసం దిగి.. నాలాలో బాలుడి గల్లంతు
జల్సాలకు అలవాటు పడ్డ ఇంద్రజిత్ గౌరాయ్ ఈ దోపిడీకి సూత్రదారుడని అనుమానించి అతడిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో యజమాని రంజిత్‌గౌరాయ్ వద్ద బంగారు ఆభరాణాలు తయారు చేస్తున్న 40 మంది కార్మికులలో కొందరి సహకారం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్, 40 మంది వర్కర్ల కాల్ డేటాలను సేకరించి విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. దోమలగూడ అరవింద్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రంజిత్ గౌరాయ్ పదేళ్లుగా నగరంలోని వివిధ షోరూంలలో ఆర్డర్లపై నగలను తయారు చేసి సరఫరా చేస్తుంటారు.
ఇతను పశ్చిమ బెంగాల్ వాసి కావడంతో అక్కడ పనిచేసే కార్మికులంతా పశ్చిమబెంగాల్ వాసులే నగలు తయారు చేస్తుంటారు. వీరంతా అర్థరాత్రి రెండు గంటల వరకు నగల తయారీని చేస్తుంటారు. ఇంటి మొదటి అంతస్తులో నగల తయారీ చేస్తుండగా, రెండో అంతస్తులో రంజిత్‌గౌరాయ్ అతడి భార్య ఇద్దరు పిల్లలు, మరో గదిలో ఇంద్రజిత్ గౌరాయ్ భార్య ఇద్దరు పిల్లలు ఉంటు న్నారు.
గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన, మొదటి, రెండో అంతస్తులో ఉన్న గేట్లను ఎలా తొలగించారని, వారికి వర్కుషాపులో పనిచేసే వారు ఎవరైనా సహకరించారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీలో ఇంద్రజిత్ గౌరాయ్ హస్తం ఉందా, వర్కుషాపులో పనిచేసే కార్మికులలో ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై దోమలగూడ సీఐ శ్రీనివా్‌సరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, రెండు కిలోల బంగారు నగలు చోరీ చేసి దొంగలను పట్టుకునేందుకు ఐదు పోలీసు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News
Updated Date - Dec 14 , 2024 | 10:17 AM