ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పనిలో చేరిన నాలుగు రోజులకే..

ABN, Publish Date - Oct 05 , 2024 | 11:53 AM

బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన వ్యక్తి ఓ బంగారం దుకాణంలో పనిలో చేరాడు. నాలుగు రోజులకే దుకాణ యజమానికి టోకరా వేసి రూ. 30లక్షలతో ఉఢాయించాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులుTask Force Police) ఇద్దరు నిందితుల ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

- బంగారం దుకాణ యజమానికి టోకరా

- రూ. 30 లక్షలు తీసుకుని బెంగళూరుకు పరార్‌

హైదరాబాద్‌ సిటీ: బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన వ్యక్తి ఓ బంగారం దుకాణంలో పనిలో చేరాడు. నాలుగు రోజులకే దుకాణ యజమానికి టోకరా వేసి రూ. 30లక్షలతో ఉఢాయించాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(Task Force Police) ఇద్దరు నిందితుల ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు. మొత్తం సొత్తు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రోహన్‌ కాదం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చాడు. తెలిసిన వారి సహకారంతో సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌(Secunderabad Market Police Station) పరిధిలోని జ్యోతిర్లింగ్‌ గోల్డ్‌ రిఫైనరీ (బంగారం శుద్ధిచేసేది) దుకాణంలో పనికి చేరాడు.

ఈ వార్తను కూడా చదవండి: MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..


చేరిన నాలుగో రోజు మెరుగుపెట్టిన 400 గ్రాముల బంగారు ఆభరణాలను సికింద్రాబాద్‌లోని ఎస్‌.ఎమ్‌ జువెలర్స్‌ దుకాణంలో ఇచ్చి, రూ. 30 లక్షల నగదు తీసుకురావాలని రోహన్‌కు యజమాని సూచించాడు. దాంతో రోహన్‌ ఆ బంగారు ఆభరణాలను తీసుకెళ్లి ఎస్‌.ఎమ్‌ దుకాణంలో ఇచ్చి వారు ఇచ్చిన రూ. 30లక్షలు తీసుకున్నాడు. అనంతరం డబ్బు తీసుకొని యజమాని వద్దకు రాకుండా... తన స్నేహితులు ముజమ్మిల్‌ బలిగర్‌, పృథ్వీరాజ్‌, ప్రసాద్‌లతో కలిసి రూ. 30లక్షలు తీసుకొని స్విఫ్ట్‌కారులో బెంగళూరు(Bangalore) పారిపోయారు. రోహన్‌ మోసం చేశాడని తెలుసుకున్న దుకాణ యజమాని వెంటనే మార్కెట్‌ పోలీసులను ఆశ్రయించాడు.


ఉన్నతాధికారులు ఆదేశాలతో నార్త్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, ఎస్సై జ్ఞానదీప్‌, శ్రీనివాసులు, దాసు రంగంలోకి దిగారు. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, ఎస్సై శ్రీవర్థన్‌లతో కలిసి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి, 24 గంటల్లో నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రోహన్‌, ముజమ్మిల్‌ను అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 29.92లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకొని కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌, మార్కెట్‌ పోలీసులను సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అభినందించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌస్ లు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 11:53 AM