Hyderabad: మోసం చేశాడని యువతి ఫిర్యాదు.. సినీనటుడిపై కేసు
ABN, Publish Date - Nov 27 , 2024 | 07:41 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సినీనటుడు శ్రీతేజ్(Film actor Sree Tej)పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గచ్చిబౌలి పోలీస్స్టేషన్(Gachibowli Police Station)లో ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సినీనటుడు శ్రీతేజ్(Film actor Sree Tej)పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గచ్చిబౌలి పోలీస్స్టేషన్(Gachibowli Police Station)లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కూకట్‌పల్లి(Kukatpally) పోలీసులకు బదిలీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: TGSRTC: మెట్రోరైల్ తరహాలో బస్సుల్లో సీట్లు
మూసాపేట్ ఆంజనేయనగర్(Moosapet Anjaneyanagar)లో ఉండే సదరు నటుడిపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే యువతి కేసు పెట్టగా, చార్జిషీట్ వేసి కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసు కోర్టులో నడుస్తోంది. సోమవారం మరోసారి యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోసం, చీటింగ్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ ముత్తు(CI Muthu) తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి
ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 27 , 2024 | 07:41 AM