ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Accident: కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

ABN, Publish Date - Feb 04 , 2024 | 02:51 PM

కాశ్మీర్‌ వెళుతున్న ఓ కుటుంబం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృత్యువాత చెందగా..మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మరోచోట జంతువులతో వెళ్తున్న వాహనం కూడా ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది.

కాశ్మీర్‌(Kashmir) వెళుతున్న ఓ కుటుంబం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైంది. ఉధంపూర్ జిల్లాలో వేగంగా వెళ్తున్న ట్రక్కు ఆకస్మాత్తుగా ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..మరో వ్యక్తి గాయపడ్డారు. మృతి చెందిన వారిలో నితిన్ డోగ్రా (37), అతని భార్య రిట్టు (32), కుమార్తెలు ఖుషి (17), వాణి (11) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి 15 ఏళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Chennai: వామ్మో ఎంతఘోరం.. ఇద్దరు పిల్లల తల్లిని హత్య చేసి కాల్చేసిన ప్రియుడు


మరో దురదృష్టకర ఘటనలో తెల్లవారుజామున 5 గంటలకు జమ్మూలోని మన్వాల్ సమీపంలోని వంతెనపై నుంచి బోవిన్ జంతువులతో కూడిన వాహనం పడిపోవడంతో గుర్తు తెలియని ట్రక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. జాంద్రా నుంచి మన్వాల్‌కు వెళ్తున్న ట్రక్కు సౌనూ గ్రామ సమీపంలోని వంతెనపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని డ్రైవర్, డజనుకు పైగా బోవిన్ జంతువులు మరణించాయి.

Updated Date - Feb 04 , 2024 | 02:52 PM

Advertising
Advertising