మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lasya Nanditha: లాస్య నందిత కారు ఢీ కొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీనే.. అసలేం జరిగింది..!?

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:18 PM

Lasya Nanditha Car Accident: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మొదట డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అందరూ భావించినప్పటికీ ఆలస్యంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్‌ను పదే పదే పోలీసులు విచారించినప్పటికీ ‘తెలియదు.. గుర్తులేదు..’ ఈ రెండు మాటలే చెప్పడంతో ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడింది..

Lasya Nanditha: లాస్య నందిత కారు ఢీ కొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీనే.. అసలేం జరిగింది..!?

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మొదట డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అందరూ భావించినప్పటికీ ఆలస్యంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్‌ను పదే పదే పోలీసులు విచారించినప్పటికీ ‘తెలియదు.. గుర్తులేదు..’ ఈ రెండు మాటలే చెప్పడంతో ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడింది.


Tipper-Lasya-Nanditha.jpg

తాజాగా ఏం తేలింది..?

లాస్య నందిత కారు ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోయే ముందు.. మొదట టిప్పర్ లారీని ఢీ కొన్నట్లు పోలీసులు తేల్చారు. ఆ టిప్పర్ లారీని సైతం పోలీసులు గుర్తించారు. లాస్య కారు ఓఆర్ఆర్‌పైకి ఎంటరైన టైమ్‌లో సీసీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటికి వచ్చింది. టిప్పర్ లారీ నంబర్ ఆధారంగా ఎటువైపు వెళ్లిందని పరిశీలించిన పఠాన్‌చెరు పోలీసులు కర్ణాటకలో ఉందని గుర్తించారు. లాస్య కారు.. టిప్పర్‌ లారీని ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కారు డ్రైవర్ ఆకాష్ చెప్పినట్లుగా సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే.. ప్రమాదం జరిగిన తీరుకు.. డ్రైవర్ చెబుతున్న మాటలకు అస్సలు పొంతన లేకపోవడం.. ఇప్పుడు టిప్పర్ లారీని గుర్తించడంతో లేనిపోని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో టిప్పర్ డ్రైవర్ దొరికితే అసలు విషయం బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు.. లాస్య కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.


టిప్పర్ డ్రైవర్ సంగతేంటి..?

లారీ టిప్పర్ దొరికింది కానీ.. డ్రైవర్ మాత్రం ఇంతవరకూ కనిపించలేదు. అతని కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత హైవేపై నుంచి నేరుగా కర్ణాటకకు వెళ్లాడు. దీంతో లారీ ఓనర్ ఎవరు..? ప్రమాదం జరిగిన రోజు టిప్పర్‌ను నడిపిందెవరు..? అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ది ఎలాంటి తప్పు లేకపోతే వాహనాన్ని ఆపి.. కనీసం సహాయక చర్యలు అయినా చేసి ఉండొచ్చు కదా..? అనేది ఇప్పుడు లాస్య అభిమానులు, అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న. ఒకవేళ టిప్పర్ ఢీ కొనడంతోనే.. లాస్య కారు వేగంగా వెళ్లి రెయిలింగ్‌ను ఢీ కొన్నదా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియవచ్చింది.

లాస్య కారు ప్రమాదానికి సంబంధించిన వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 03:09 PM

Advertising
Advertising