Car Accident: పోలీసు తనయుడి దాష్టీకం.. మహిళ రోడ్డు దాటుతుండగా..
ABN, Publish Date - Jun 13 , 2024 | 09:41 PM
మహారాష్ట్రలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మహిళ భోసారి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొంది. దీంతో..
మహారాష్ట్రలో (Maharashtra) ఓ ఘోర రోడ్డు ప్రమాదం (Car Accident) చోటు చేసుకుంది. ఒక మహిళ భోసారి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొంది. దీంతో.. ఆమె గాల్లో ఎగిరి కొంత దూరంలో పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ చూసి అక్కడున్న వ్యక్తులందరూ నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే తేరుకొని.. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Read Also: పాకిస్తాన్‌కు తప్పిన గండం.. కానీ ముందుంది మరో పెద్ద చిక్కు!
ఈ ఘటనపై మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ఆ కారు ఎవరిది అని పరిశీలించగా.. వినయ్ విలాస్ నాయక్రే అనే వ్యక్తి పేరుపై రిజిస్టరై ఉందని తెలిసింది. దీంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అప్పుడే.. అతను ఓ పోలీసు అధికారి కొడుకు అని తేలింది. అతనిపై ఐపీసీ 279 (రాష్ డ్రైవింగ్), 337 (ఇతరులకు హాని కలిగించడం) సెక్షన్ల కింద, అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Read Also: బాత్రూంలోనే ఎక్కువగా గుండెపోటు ఎందుకొస్తుంది..?
ఇదిలావుండగా.. ఈమధ్య కాలంలో మహారాష్ట్రలో ఇటువంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. పాదాచారుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పూణెలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ రోడ్డు దాటుతుండగా.. ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆమెను ఢీకొంది. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలోనూ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
Read Latest Crime News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 09:41 PM