Gold Seized: ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల గోల్డ్ స్వాధీనం
ABN, Publish Date - May 04 , 2024 | 11:17 AM
ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గోల్డ్ పట్టుబడింది. కస్టమ్స్ శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా ఏకంగా 12.74 కేజీల బంగారంతో సహా మొత్తం రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గోల్డ్ పట్టుబడింది. కస్టమ్స్ శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా ఏకంగా 12.74 కేజీల బంగారంతో సహా మొత్తం రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు ఐదుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు నాలుగు ఐఫోన్లతోపాటు వివిధ రూపాల్లో దాచిపెట్టిన పుత్తడిని పట్టుకున్నారు.
అయితే ఈ బంగారాన్ని మొత్తం 20 కేసులలో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారంతోపాటు స్వాధీనం చేసుకున్న వస్తువులలో నాలుగు ఐఫోన్లు ఉన్నాయి. ఈ పుత్తడిని లో దుస్తువులు, వాటర్ బాటిల్స్, శరీరంపై పలు చోట్లు దాచుకుని అక్రమంగా తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. దొరికిన బంగారం విలువ రూ.8.37 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి:
Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Crime News and Telugu News
Updated Date - May 04 , 2024 | 11:30 AM