Secunderabad: అన్నదమ్ముల వక్రమార్గం.. డబ్బు కోసం వారు చేసిన పనేంటో తెలిస్తే..
ABN, Publish Date - Nov 27 , 2024 | 08:40 AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో జీఆర్‌పీ పోలీసులు రూ. 4.50 లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలను వెల్లడించారు.
- గంజాయి సరఫరా
- 18 కిలోల పట్టివేత
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరి అరెస్టు
- వెస్ట్ బెంగాల్ టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో జీఆర్‌పీ పోలీసులు రూ. 4.50 లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్(West Bengal) హుగ్లీ మండలం రత్‌టాలా గ్రామానికి చెందిన ప్రీతం చౌదరి(37), సత్యం చౌదరి(29) అన్నదమ్ములు.
ఈ వార్తను కూడా చ,దవండి: Hyderabad: జీహెచ్‌ఎంసీ అధికారులను బెదిరించిన ఎమ్మెల్సీ
సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ పట్టణంలో 18 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ముంబైలో విక్రయించేందుకు రైలులో గంజాయి బ్యాగులతో వస్తున్నారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, ఎస్‌ఐ మాజిద్, రమేష్‌తో పాటు కానిస్టేబుళ్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్లాట్ ఫాం నంబరు 2లో ఆగి ఉన్న ముంబై ఎక్స్‌పెస్ లో లగేజీలను తనిఖీ చేశారు. అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌గో గంజాయి కొనుగోలు చేసి ఒక్కో ప్యాకెట్ రూ. 18 వేలకు మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. రైల్వే ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు ప్రతిరోజూ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్నామని జీఆర్‌పీ సీఐ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి
ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 27 , 2024 | 08:40 AM