ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp Scams: వాట్సాప్‌ ద్వారా ఏడు రకాల మోసాలు..అలర్ట్ చేసిన కేంద్రం

ABN, Publish Date - Jan 21 , 2024 | 03:19 PM

ఇటివల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ ద్వారా సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఏడు మోసాలను గుర్తించిన కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) వాటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇటివల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ ద్వారా సైబర్ మోసాలు(WhatsApp scams) క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఏడు మోసాలను గుర్తించిన కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) వాటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ ఏడు రకాల మోసాల్లో మిస్డ్ కాల్స్, వీడియో కాల్స్, జాబ్ ఆఫర్‌లు, పెట్టుబడి ప్రణాళికలు, డుప్లికేట్, హైజాకింగ్, స్క్రీన్ షేరింగ్ వంటివి ఉన్నాయని తెలిపింది. అంతేకాదు ఇవే కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు పంపిస్తున్న లింకులు క్లిక్ చేయోద్దని కూడా సూచించారు


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Wife: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన భర్త..ఎందుకలా చేశాడు?


హైజాకింగ్ స్కామ్‌లో భాగంగా స్కామర్లు బాధితుడి వాట్సాప్ (WA) ఖాతాను అనధికారికంగా యాక్సెస్‌ చేసి వారి పరిచయస్తుల నుంచి డబ్బును అభ్యర్థించి మోసం చేస్తారని అధికారులు చెప్పారు. ఇంకొంత మంది తెలియని నంబర్ల నుంచి WhatsApp వీడియో కాల్‌ చేసి నగ్న వీడియోలను చూపించి ఆపై వినియోగదారులను బెదిరించి డబ్బులు లాగుతారని అధికారులు అన్నారు. దీంతోపాటు ఉద్యోగాల విషయంలో కూడా సీనియర్ ఆఫీసర్‌గా నటిస్తూ అనేక మందిని దుండగులు మోసం చేస్తారని తెలిపారు.

ఇంకొంత మంది స్కామర్‌లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు మొదలైన వాటికి చెందిన అధికారులుగా నటించి తమ స్క్రీన్‌ను షేర్ చేయమని ఒప్పించి చీట్ చేస్తారని వెల్లడించారు. దీంతోపాటు ఓటీపీలు, సోషల్ మీడియా హ్యాండిల్‌లను సర్ఫింగ్ చేయడం లేదా ఫేక్ ప్రొఫైల్‌లను సృష్టించడం వంటి మోసాలు కూడా జరుగుతున్నాయని అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. ఇలాంటి క్రమంలో ప్రజలు తెలియని వ్యక్తులకు సమాధానం ఇవ్వవద్దని, అలాంటి నంబర్‌లను బ్లాక్ చేయాలని సూచించారు.

Updated Date - Jan 21 , 2024 | 03:19 PM

Advertising
Advertising