Suspension: ఎస్‌ఐ, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్..
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:23 AM
డబ్బుల విషయంలో ఓ వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించిన ఘటనలో టప్పాచబుత్ర ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, సివిల్ తగాదాల్లో తలదూర్చి ఒకరికి మద్దతుగా వ్యవహరించారన్న కారణంతో ఓ ఏఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు.
డబ్బుల విషయంలో ఓ వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించిన ఘటనలో టప్పాచబుత్ర ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, సివిల్ తగాదాల్లో తలదూర్చి ఒకరికి మద్దతుగా వ్యవహరించారన్న కారణంతో ఓ ఏఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి(Hyderabad CP Srinivas Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఆదిల్ రియాజ్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రాజేశ్, బాలరాజును సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సుల్తాన్‌బజార్‌లోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు కొంతకాలంగా ఇల్లీగల్‌గా ఇంజక్షన్లు, మందులు అమ్ముతున్నట్లు ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు తెలుసుకుని, డబ్బుల కోసం ఈనెల 4న అతన్ని బెదిరించేందుకు యత్నించారని, అంతేకాకుండా ఇతను మరొకరికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వసూలు చేసేందుకు ప్రయత్నించారని తెలిసింది.
ఇదికూడా చదవండి: KTR: 48 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించండి.. లేదంటే..
దీంతో సదరు షాపు నిర్వాహకుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అక్కడినుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి విచారించడంతో భయపడ్డ బాధితుడు, ఆయన బంధువులు సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులు ఎస్‌ఐని, కానిస్టేబుళ్లను పిలిపించి విచారించగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కమిషనర్‌కు రిపోర్టును అందజేశారు. దీంతో ఎస్‌ఐని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి చేతులు దులుపుకొన్నాడు. మెడికల్‌షాప్ నిర్వాహకుడిని సుల్తాన్‌బజార్ నుంచి తీసుకొస్తున్న సమయంలో అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 17 , 2024 | 11:23 AM