ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల నడకదారిలో భక్తుడు మృతి

ABN, Publish Date - Dec 14 , 2024 | 07:56 AM

స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉల్లాసంగా అలిపిరి మెట్లెక్కుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండె పట్టుకుని పడిపోయిన మిత్రుడికి ఏమైందో తెలియక పైకి లేపేందుకు ప్రయత్నించారు తోటి స్నేహితులు. పక్కన భక్తులు, సమీపంలోని సిబ్బందితో కలిసి వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.

- మృతుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి

తిరుమల: స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉల్లాసంగా అలిపిరి మెట్లెక్కుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండె పట్టుకుని పడిపోయిన మిత్రుడికి ఏమైందో తెలియక పైకి లేపేందుకు ప్రయత్నించారు తోటి స్నేహితులు. పక్కన భక్తులు, సమీపంలోని సిబ్బందితో కలిసి వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: రైల్వేస్టేషన్‌లో పది కిలోల గంజాయి స్వాధీనం


మరికొన్ని గంటల్లో స్వామిని దర్శించుకుంటామనుకుంటే ఇలా జరిగిందంటూ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లోని అమీర్‌పేట్‌కు చెందిన సీహెచ్‌.రవికుమార్‌(38) ఐదుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకున్నాడు. దర్శనానికి సమయం ఉండటంతో శ్రీకాళహస్తి(Srikalahasti) వెళ్లి తిరిగి మధ్యాహ్నం తిరుపతి చేరుకున్నారు. మొక్కులో భాగంగా అలిపిరి నుంచి తిరుమలకు నడక ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: రైల్వేస్టేషన్‌లో పది కిలోల గంజాయి స్వాధీనం


స్నేహితులతో మాట్లాడుకుంటూ 2,500వ మెట్టు వరకు చేరుకున్నారు. అప్పటివరకు సరదాగా కనిపించిన రవికుమార్‌ ఒక్కసారిగా ఛాతినొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. పైకి లేపేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో అంబులెన్స్‌లో తిరుమలలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రవికుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రవికుమార్‌ సోదరుడికి సమాచారమిచ్చారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 07:56 AM