ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: ఏమార్చి.. నగలు కాజేసి..

ABN, Publish Date - Oct 30 , 2024 | 01:20 PM

ప్రజలను ఏమార్చి, బ్యాగుల్లోని బంగారు నగలు, సెల్‌ఫోన్లు అపహరించే ఇద్దరు నిందితులను తిరుపతి క్రైం పోలీసులు(Tirupati Crime Police) అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్‌ తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ(Krishna District Gudivada) మండలానికి చెందిన వేముల శివకుమార్‌ వృత్తి రీత్యా తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి వద్ద ఉంటున్నాడు.

- ఇద్దరు నిందితుల అరెస్టు

- రూ.3.6 లక్షల విలువైన బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

తిరుపతి: ప్రజలను ఏమార్చి, బ్యాగుల్లోని బంగారు నగలు, సెల్‌ఫోన్లు అపహరించే ఇద్దరు నిందితులను తిరుపతి క్రైం పోలీసులు(Tirupati Crime Police) అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్‌ తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ(Krishna District Gudivada) మండలానికి చెందిన వేముల శివకుమార్‌ వృత్తి రీత్యా తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి వద్ద ఉంటున్నాడు. ఇతడితో పాటు వేములపల్లి దుర్గ ఉంటోంది. ఈజీ మనీ కోసం వీరు దొంగతనాలకు అలవాటు పడ్డారు. వారి సహచరులు దుర్గా ప్రసాద్‌, జగదీష్‏తో కలసి గుడివాడ, భీమవరం, ఆకివీడు, నిడదవోలు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 30కి పైగా ఇంటి దొంగతనాలకు పాల్పడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Union Minister: హీరో విజయ్‌కు సిద్ధాంతాలపై స్పష్టత లేదు


ఈ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు. ఇందులో దుర్గ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వద్ద విలువైన బంగారు నగలు, సెల్‌ఫోన్లను వారి బ్యాగుల నుంచి దొంగిలించి పారిపోవడంలో ఆరితేరిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనం కేసుల్లో దర్యాప్తు జరిపిన క్రైం పోలీసులు వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ క్రమంలో మంగళవారం అలిపిరి బస్టాండు వద్ద ఇద్దరు నిందితులు ఉండగా క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.60 లక్షల విలువైన బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రమణకుమార్‌ చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 01:34 PM