Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు ఏం చేస్తారు..?
ABN, Publish Date - Jun 16 , 2024 | 07:24 AM
దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా(Ganga Dussehra 2024) పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్(Uttarakhand), యూపీ(UP) సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా(Ganga Dussehra 2024) పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్(Uttarakhand), యూపీ(UP) సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తున్నారు. గంగామాతతో పాటు, శివుడిని పూజించి స్వామికి పుష్పాలను సమర్పించి దీపాలు వెలిగిస్తున్నారు.
ఈ పండుగ తిథి జూన్ 16న తెల్లవారుజామున 2.32 గంటలకు ప్రారంభమై జూన్ 17 తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. గంగా దసరా(Ganga Dussehra) రోజున దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, జీవితంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. పురాణాల ప్రకారం భగీరథ రాజు కఠోర తపస్సుకు సంతోషించిన గంగామాత, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున హస్తా నక్షత్రంలో స్వర్గం నుంచి భూమికి వచ్చిందని భావిస్తారు. ఆ క్రమంలో గంగామాతను ఆరాధించడం ద్వారా దుఃఖాలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
గంగా మాత(Ganga) ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది. గంగ భూమిపైకి వచ్చాక ఇక్కడి బంజరు భూమి సారవంతమై ప్రతి ప్రాంతాన్ని పచ్చదనంతో కప్పేసింది. అప్పటి నుంచి గంగా దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూ మతంలో గంగా నదిని దేవతగా పూజిస్తారు. దీనిని శాస్త్రాలలో మోక్షదాయిని అని పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం గంగలో స్నానం చేయడం వల్ల వ్యక్తి పాపాలు తొలగిపోయి, ఆనందం, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం.
ఇది కూడా చదవండి:
వర్షార్పణం కెనడాతో భారత్ మ్యాచ్ రద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 16 , 2024 | 08:51 AM