SitaRam:ఆలకించిన రామయ్యా..!! కళ్యాణ వేడుకల లైవ్ టెలికాస్ట్‌కు ఈసీ ఓకే
ABN, Publish Date - Apr 16 , 2024 | 08:56 PM
భక్తుల మొరను ఆ భద్రాద్రి రాములోరు ఆలకించినట్టు ఉన్నారు. మంగళవారం పొద్దుపోయే వరకు రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారం అంశంపై ఈసీ స్పష్టత ఇవ్వలేదు. కాసేపటి క్రితం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హిందువులు, రామ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: భక్తుల మొరను ఆ భద్రాద్రి రాములోరు (Lord Ram) ఆలకించినట్టు ఉన్నారు. మంగళవారం పొద్దుపోయే వరకు రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారం అంశంపై ఈసీ స్పష్టత ఇవ్వలేదు. కాసేపటి క్రితం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హిందువులు, రామ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. సీతారాముల కల్యాణాన్ని చూసే భాగ్యం కలుగబోతుందని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం 1987 నుంచి చేస్తున్నారు. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లైవ్ ఇచ్చింది. రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మాట్లాడారని ఈసీకి రాసిన లేఖలో రేవంత్ ప్రభుత్వం గుర్తుచేసింది. ఏప్రిల్ 4వ తేదీన తొలిసారి లేఖ రాసింది. అందుకు ఈసీ నుంచి నో అనే సమాధానం వచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన మరోసారి లేఖ రాసింది. దాంతో ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇచ్చింది.
భద్రాద్రి రాములోరి ఆలయంలో వసంత పక్ష శ్రీరామ నవి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కొలు ఉత్సవం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం ఆనవాయితిగా చేస్తుంటారు. శ్రీ రాముడు, సీతమ్మ తల్లి విగ్రహాలను ఎదురుగా కూర్చొబెట్టి ఇరు వంశాల కీర్తి ప్రతిష్ఠ, తెలిపేలా అర్చకుల మాట్లాడుతారు. రాములోరి కళ్యాణానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో భక్తులు సంబర పడుతున్నారు.
Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే
మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం
Updated Date - Apr 16 , 2024 | 08:56 PM