ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Chaturthi: వినాయక చవితికి ఎలాంటి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:20 PM

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ కానుంది. హిందూ మతంలో ప్రతి కుటుంబం తమ తాహతు మేరకు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే..

Ganesh Chaturthi

తొలి పూజలు అందుకునేవాడు, విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు. ప్రతి సంవత్సరం భాద్రపద మాస శుక్ల చవితి రోజు వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ కానుంది. హిందూ మతంలో ప్రతి కుటుంబం తమ తాహతు మేరకు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే వినాయక చవితిరోజు పూజ కోసం ఎలాంటి వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావాలి? ఎలాంటి విగ్రహం తెస్తే మంచిది? వాటి ఫలితాలు ఏంటి? తెలుసుకుంటే..

పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!


ఎలాంటి విగ్రహం ఉత్తమం..

వినాయక చవితి రోజు ఇంట్లో ప్రతిష్టించే వినాయక విగ్రహం తెలుపు రంగులో ఉంటే మంచిది. ఇది శాంతిని శ్రేయస్సును సూచిస్తుంది. అదే విధంగా వినాయకుడు కూర్చొన్న భంగిమలో ఉండాలి. దీనినే లలితాసనం అని అంటారు. తొండం ఎడమ వైపున ఉంటే శుభప్రదంగా భావిస్తారు.

ఈ జాగ్రత్తలు పాటించండి...

వినాయకుడు విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వచ్చేముందు వినాయకుడు తల కనిపించకుండా కప్పిపెట్టాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో మాత్రమే ముఖాన్ని కప్పిన వస్త్రం లేదా కాగితం వంటివి తీయాలి.

వినాయకుడు విగ్రహాన్ని కుటుంబంలో పద్దతుల ప్రకారం చతుర్థి పూజ ప్రారంభం నుండి ఒకటిన్నర రోజులు, మూడు, ఐదు, ఏడు లేదా పదకొండు రోజులకు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!


ఇలా ఆలోచించండి..

వినాయకుడి విగ్రహాలను ఆడంబరాల కోసం పెద్దగా, రంగు రంగులలో కొనుగోలు చేయకండి. పర్యావరణానికి అనుకూలంగా సహజమైన మట్టి, సేంద్రియ నేల, మొక్కల విత్తనాలతో కూడిన గణపతి విగ్రహాలు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటివి కొనుగోలు చేస్తే వినాయకుడిని ఇంట్లోనే ఒక మట్టి కుండీలో నిమజ్జనం చేసి అదే కుండీలో మొక్క పెంచవచ్చు.

ఇవి కూడా చదవండి..


Ganesh Chaturthi 2024: లంబోదరుడి పూజలో 21 రకాల ఆకుల ప్రత్యేకత.. నిమజ్జనం ఎందుకు చేస్తారు


Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..


Ganesh Chaturthi: వినాయకుడి వ్రత కథ.. వింటే కోటి జన్మల పుణ్యం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 03 , 2024 | 04:41 PM

Advertising
Advertising