ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara Navaratri 2024: దుర్గాష్టమి.. అమ్మవారిని ఇలా పూజించండి..

ABN, Publish Date - Oct 09 , 2024 | 07:31 PM

శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.

Dasara Navaratri 2024: శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.

Naga Human Skull: కేంద్రమంత్రికి సీఎం లేఖ.. ఆగిన వేలం


ఈ రోజే ఆయుధపూజ ఎందుకంటే..?

పంచమ వేదం మహాభారతం. అందులో పాండవులు అరణ్యవాసం ముగించారు. అనంతరం వారు అజ్ఞాతవాసానికి వెళ్తూ.. జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను దాచి ఉంచుతారు. ఇక ఆ అజ్ఞాతవం ముగిసే సమయంలో.. జమ్మి చెట్టుపై దాచి ఉంచిన ఆయుధాలను అర్జునుడు తీసి.. పూజిస్తాడు. అనంతరం ఉత్తర గోగ్రహణ యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో అర్జునుడు శత్రు ముకలను జయించి విజయుడవుతాడు.

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

Also Read: Nobel Prize in Chemistry 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్


ఏడాది పాటు ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు ఆనాటి నుంచి పవిత్రతను సంతరించుకుంది. నాటి నుంచి నేటి వరకు దుర్గాష్టమి వేళ.. జమ్మిచెట్టుకు భక్తులు పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవియే నమ: అనే మంత్రం జపిస్తే.. భక్తులకు అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారని విశ్వాసం.

Also Read: Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?


ఈ రోజు అమ్మవారికి అల్లం గారెలు, నిమ్మకాయ పులిహోర ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. దుర్గాష్టమి రోజు.. ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారిని ఎర్రని రంగు పూల రంగుతో పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.


ఇక మరో మూడు రోజుల్లో నవరాత్రులు ముగియనున్నాయి. అయితే దుర్గాష్టమి, మహార్నవమి, విజయ దశమి వరుసగా రానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో మూలమూర్తిగా కొలువు తీరిన శ్రీదుర్గాదేవి అమ్మవారు.. నిజరూప దర్శనంలో దర్శనమివ్వనున్నారు. దీంతో గురువారం సైతం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తనున్నారు. ఇక బుధవారం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ.. తన జన్మ నక్షత్రమైన మూల నక్షత్రంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 09 , 2024 | 07:32 PM