ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:45 PM

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు. ఆయన్ని దర్శించుకొనేందుకు తిరుమల కొండకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆ కలియుగ దైవాన్ని రెప్ప పాటే దర్శించుకుంటే చాలనుకుంటూ భక్త జనం కోటి ఆశలతో తిరుమలకు వస్తారు.

Tirumala Srivaru

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు. ఆయన్ని దర్శించుకొనేందుకు తిరుమల కొండకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆ కలియుగ దైవాన్ని రెప్ప పాటే దర్శించుకుంటే చాలనుకుంటూ భక్త జనం కోటి ఆశలతో తిరుమలకు వస్తారు. స్వామి వారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చిందీ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).

Also Read: Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి


ఆ ఆర్జిత సేవల్లో భాగంగా ఒక రోజంతా ఆ వెంకన్న స్వామిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని సైతం కల్పించింది. అదే శ్రీ వారి ఉదయాస్తమానసేవ. అంటే.. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు.. ఆ కోనేటి రాయుడికి జరిగే సకల వైభోగాలను కన్నులారా వీక్షించవచ్చు. అందుకు జస్ట్ రూ. కోటి టికెట్ కొనుగోలు చేస్తే చాలు. అయితే ఎవరైనా ఈ టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అంటే ఓ వ్యక్తి లేదా సంస్థ అయినా సరే. ఏడాదిలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని తిరుమల వెంకన్నను దర్శించుకోవచ్చు. ఆ రోజంతా ఏడుకొండలవాడి సేవల్లో భాగం కావచ్చు.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు.. ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను నేరుగా దర్శించవచ్చు. అలా 25 ఏళ్లు, లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగ్గట్లుగా ఈ టికెట్‌ను వినియోగించుకోనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ సేవల్లో భక్తుడితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు


ఇక సంస్థ పేరుతో టికెట్ పొందిన వారికి 20 ఏళ్ల పాటు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది. ఈ సేవా టికెట్లు పొందిన వారికి స్వామికి అర్పించిన వస్త్రాలు, ప్రసాదాలు సైతం టీటీడీ అందిస్తుంది. ఇక ఈ టికెట్ పొందిన వారు ఏదైనా కారణం చేత ఆ ఏడాది రాలేక పోతే వారి కుటుంబ సభ్యులను సైతం ఈ సేవకు పంపవచ్చు.

Also Read: Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి


అయితే ఒకసారి మాత్రమే కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసే అవకాశముంటుంది. ఆ తర్వాత తొలగింపు లేదా మార్పునకు ఏ మాత్రం అవకాశం లేదు. కానీ సంస్థలకు ఎన్నిసార్లు అయినా పేర్లు మార్పు చేసుకునే అవకాశమైతే ఉంది. ఏటా టికెట్ తీసుకున్న వ్యక్తి లైఫ్ సర్టిఫికేట్‌ను మాత్రం తప్పకుండా టీటీడీకి అందించాల్సి ఉంటుంది. మరోవైపు శ్రీవారి సేవల్లో మార్పులతో ఏప్పుడైనా దర్శనాన్ని రద్దు చేసే హక్కు తమకు ఉందని టీటీడీ స్పష్టం చేసింది.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


ఈ టికెట్‌ను ఇలా పొంద వచ్చు..

టీటీడీ అధికారిక వెబ్ సైట్‌కి లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. ఒకరికి ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ఆధార్, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్.. ఏదైనా గుర్తింపు కార్డు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌కు టీటీడీ అధికారులు పాస్‌వర్డ్, ఐడీని పంపుతారు. వాటి ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్‌ను పొందవచ్చు.


1980లోనే ఈ సేవా టికెట్లు ప్రారంభించినా..

తొలిసారిగా 1980 దశకంలో ఈ సేవా టికెట్ల జారీకి శ్రీకారం చుట్టారు. పోటీ అధికంగా ఉండటంతో మధ్యలో వీటిని నిలిపివేశారు. అయితే 2021లో వీటిని తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకు వచ్చింది. శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ. కోటి ఆపైన విరాళాలు అందించే వ్యక్తులకు, సంస్థలకు ఈ ఉదయాస్తమానసేవా టికెట్లను కేటాయిస్తూ నాటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. వారంలోని ఆరు రోజులు ఈ సేవ టికెట్లు ధర రూ. కోటి ఉంటే.. శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయిలు ఉంటుంది. అయితే శుక్రవారానికి సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే బుక్ కావడం గమనార్హం.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Sep 29 , 2024 | 12:52 PM