ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahalaya Amavasya 2024: అమావాస్య ప్రభావం.. ఈ 6 రాశుల వారికి ఇబ్బందులే..

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:20 PM

Mahalaya Amavasya 2024: నేడు పితృపక్షం చివరి రోజు. మహాలయ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి పరిస్థితి ఉందో ఓసారి చూద్దాం..

Mahalaya Amavasya

Mahalaya Amavasya 2024: ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17న ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగుస్తుంది. ఈ కాలాన్ని భాద్రపద మాసం అని కూడా పిలుస్తారు. ఈ బాధ్రపద మాసం.. మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున హిందువులు తమ పూర్వీకులను గౌరవించి.. వివిధ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన ఆచార కార్యక్రమాలు చేపడుతారు. పితృ పక్షానికి హిందూమతంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఉంది. పితృపక్షంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని విశ్వసిస్తారు. అయితే, ఈసారి మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ కలయిక వల్ల కొంతమంది రాశి వారికి జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం..


మకరం: కుటుంబం, సంబంధాల పరంగా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులకు కష్టకాలం. మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాదనలు మానుకోండి. మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోకుండా ఉండండి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.


సింహం: పని చేసే చోట, ఇంట్లో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో.. ఆర్థిక పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. పనిచేసే చోట, ఇంటి మధ్య సమతుల్యతను కొనసాగించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. వ్యాపారంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామితో అనుకూలత లోపిస్తుంది, వివాదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.


మకరం: ఈ రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశి వారు కెరీర్‌ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగానూ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. నిధుల కొరత కారణంగా.. చేపట్టిన ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రహస్య చింతలు మిమ్మల్ని వెంటాడతాయి.


కుంభం: ఈ రోజు ఈ రాశివారి వ్యక్తిగత లేదా వృత్తి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడి కారణంగా, మీ ప్రవర్తనలోనూ తేడా వస్తుంది. ఇది మీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. గ్రహణం రోజున ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త వ్యాపారం, ప్రాజెక్ట్ ఏదీ ప్రారంభించకూడదు. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.


కుంభం: ఈ రోజు ఈ రాశివారి వ్యక్తిగత లేదా వృత్తి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడి కారణంగా, మీ ప్రవర్తనలోనూ తేడా వస్తుంది. ఇది మీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. గ్రహణం రోజున ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త వ్యాపారం, ప్రాజెక్ట్ ఏదీ ప్రారంభించకూడదు. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.


మీనం: ఈ రాశి వారి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో.. చంద్రుడు మనస్సును నియంత్రించే వాడిగా పేర్కొన్నారు. చంద్రుని కారణంగా మీ మనస్సు కలవరానికి గురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. వృధా ఖర్చులను నియంత్రించాలి. లేదంటే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


Also Read:

బతుకమ్మ చరిత్ర మీకు తెలుసా?

మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు...

For More Devotional News and Telugu News..

Updated Date - Oct 02 , 2024 | 04:20 PM