ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara Navaratri 2024: ఆరో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:25 PM

అమ్మవారిని ఆరాధించేందుకు శరన్నవరాత్రులు విశేషమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 అలంకారాల్లో పూజిస్తారు. ఈ సందర్బంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆ క్రమంలో ఆరో రోజు అంటే.. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్టి రోజు.. దుర్గమ్మ వారు.. శ్రీమహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అమ్మవారిని ఆరాధించేందుకు శరన్నవరాత్రులు విశేషమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 అలంకారాల్లో పూజిస్తారు. ఈ సందర్బంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆ క్రమంలో ఆరో రోజు అంటే.. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్టి రోజు.. దుర్గమ్మ వారు.. శ్రీమహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు.


బెల్లముతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే.. విశేష ఫలితాలుంటాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇప్పటికే గత ఐదు రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమ: అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని చెబుతున్నారు.


లక్ష్మీఅష్టకం స్తోత్రం 

ఓం నమోస్తేస్తు మహా మాయే శ్రీ పీఠే సురపూజితే|

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ||

నమస్తే గరుడా రూఢే డోలాసుర భయంకరీ |

సర్వ పాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే||

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరీ |

సర్వ దుఃఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయినీ |

మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ||

ఆద్యన్త రహితే దేవిఈ ఆది శక్తి మహేశ్వరీ |

యోగజ్ఞే యోగా సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తీ మహోదరే|

సర్వపాప హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

పద్మాసన స్థితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ |

పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే||

శ్వేతాంబరధరే దేవీ నానాలంకార భూషితే|

జగత్ స్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యఃపఠేద్భక్తి మాన్నరః |

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏక కాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |

ద్వికాలం యఃపఠేన్నిత్యం ధన్ ధాన్య సమన్విత ః||

త్రికాలం యఃపఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Oct 07 , 2024 | 04:25 PM