ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara Navaratri 2024: శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు.. ఎప్పుడంటే..?

ABN, Publish Date - Oct 08 , 2024 | 05:13 PM

శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్రమంలో ఏడో రోజు అంటే ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి రోజు దుర్గమ్మవారు.. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Dussehra 2024: శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్రమంలో ఏడో రోజు అంటే ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి రోజు దుర్గమ్మవారు.. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చదువు, విజ్ఞానం, సంగీతం, కళలకు దేవతగా సరస్వతి దేవిని భక్తితో కొలుస్తారు. ఓం శ్రీసరస్వతీ దేవియే నమ: అనే మంత్రం ఈ రోజు చదువుకోవాలి.


ఈ రోజు.. అమ్మవారికి అటుకులు, బెల్లం, శనగపప్పు, కోబ్బరి ప్రసాదంతోపాటు దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక సరస్వతి దేవిని తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు. అయితే అమ్మవారి జన్మ నక్షత్రం.. మూలా. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే.. శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని విశ్వసిస్తారు.


మూల నక్షత్రం విశిష్టత ఏమిటంటే..?

శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. సప్తమి తిథి సరస్వతి అమ్మవారిది. ఇక అష్టమి దుర్గాదేవి. నవమి, మహార్నవమి మహిషాసుర మర్ధిని పూజిస్తారు. మూల నక్షత్రం ఉన్నప్పుడే సరస్వతి దేవిగా దుర్గమ్మను అలంకరించి.. పూజిస్తారు. మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దుర్గమ్మ వారు.. బుధవారం సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు.

ఈ నేపథ్యంలో అమ్మవారి జన్మ నక్షత్రం రోజు.. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్నారు. ఇప్పటికే గత ఆరు రోజులుగా వివిధ రూపాల్లో దర్శమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 08 , 2024 | 05:18 PM