Share News

Today Horoscope : ఈ రాశి వారు ప్రత్యర్థులపై విజయం అందుకుంటారు.

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:23 AM

నేడు (21-10-2024-సోమవారం) తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

Today Horoscope :  ఈ రాశి వారు ప్రత్యర్థులపై విజయం అందుకుంటారు.

నేడు (21-10-2024-సోమవారం) తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వివాహ నిర్ణయాలకు సంబంధించిన చర్చలకు అనుకూలం. బందుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆడిటింగ్‌, క్రీడలు, రచనల రంగాల వారికి సంకల్పం నెరవే రుతుంది.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విదేశాలు, దూరప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూలం. రాజకీయ, సి.నీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఒక శుభవార్త అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. యూనియన్‌ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. నలుగురిలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాలపై దృష్టి పెడతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. వారసత్వ వ్యవహారాలకు అనుకూలం. వైద్య సేవలు అందుకుంటారు. వడ్డీ వ్యాపారులకు అనుకూల సమయం. గత అనుభవాలతో లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో కీలక ప్రాత పోషిస్తారు. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వైద్యం, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రియతములు, చిన్నారులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పొదులు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Oct 21 , 2024 | 04:23 AM