Today Horoscope : ఈ రాశి వారు స్టాక్‌మార్కెట్ లావాదేవీల పై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:51 AM
నేడు (31-12-2024-మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
నేడు (31-12-2024-మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
విదేశీ ప్రయాణాలు, వీసా వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగాల వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. రక్షణ, బోధన, న్యాయ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రుణాలు, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రి ఖర్చులకు అసవరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు, పోటీ లకు దూరంగా ఉండటం మేలు. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పెట్టబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు, హోటల్, ఫార్మా రంగాల వారికి అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, ఆడిటింగ్, చిట్‌ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడలు, బోధన రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాలు కొంత మనస్తాపం కలిగిస్తాయి. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామపారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వాహన సౌకర్యం కలుగుతుంది. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. అన్నదానం శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
షేర్ మార్కెట్ లావాదేవీల్లో మంచి లాభాలు ఆ ర్జిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పనుల ప్రారంభానికి ఇది అనుకూల సమయం. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు అందుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల విషయాల్లో విజయం సాధిస్తారు. ఫొటోగ్రఫీ, ఎగుమతులు, సినిమాలు, రాజకీయ, న్యాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడలపై కాస్త ఆచితూచి వ్యవహరించాలి.అందరినీ కలుపుకుని మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సమకారం అందుకంటారు. లక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ