ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Total Solar Eclipse: నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయోద్దంటే

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:20 AM

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం(Solar Eclipse) చైత్ర మాసంలోని అమావాస్య రోజు నేడు(ఏప్రిల్ 8న) ఏర్పడనుంది. ఇది ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 2:22 వరకు కొనసాగుతుంది. అయితే ఇది ఇండియాలో కనిపిస్తుందా లేదా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయోద్దనేది ఇక్కడ తెలుసుకుందాం.

Total Solar Eclipse On April 8th 2024

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం(Solar Eclipse) చైత్ర మాసంలోని అమావాస్య రోజు నేడు(ఏప్రిల్ 8న) ఏర్పడనుంది. ఇది ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 2:22 వరకు కొనసాగుతుంది. దీని వ్యవధి 5 గంటల 10 నిమిషాలు. అయితే సూర్యగ్రహణం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని అనేక మంది భావిస్తారు. దీంతోపాటు దీనిని జ్యోతిషశాస్త్రంలో కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఏప్రిల్ 8, 2024న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం(Total Solar Eclipse) దాదాపు 54 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశం(bharat)లో కనిపించదు. ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, క్యూబా, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, డొమినికా, జమైకా తదితర దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసముద్రం నుంచి ప్రారంభం కానుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణాన్ని సూతకాల కాలంగా పరిగణించరు. అంటే ఈ సూర్యగ్రహణం వల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావం, భౌతిక ప్రభావం, సూతక్ ప్రభావం లేదా దేశం, ప్రపంచంపై ఎలాంటి మతపరమైన ప్రభావం చూపదని అంటున్నారు.

భూమి, సూర్యుడు(sun), చంద్రుడు(moon) సరళ రేఖలో వచ్చినప్పుడు భూమి(earth) కొంత భాగం పూర్తిగా చీకటిగా మారుతుంది. అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి ఎలాంటి పరికరం లేకుండానే ఈ గ్రహణాన్ని కళ్లు తెరిచి చూడొచ్చని నిపుణులు వెల్లడించారు.


గ్రహణ సమయంలో ఏం చేయాలి

  • గ్రహణం తర్వాత గంగాజలంతో స్నానం చేస్తే శుద్ధి కలుగుతుంది. దీంపాటు మీ ఇంటిని, దేవతలను శుద్ధి చేయండి

  • సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడొద్దు

  • మీరు ఎటువంటి తప్పు చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి

  • గ్రహణం తర్వాత హనుమంతుడిని పూజించాలి

గ్రహణ సమయంలో ఇవి చేయోద్దు

  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో నిద్రించకూడదు, సూదిలో దారం వేయకూడదు

  • శ్మశానవాటిక వంటి నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దు, అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపనున్నాయి

  • ప్రయాణాలకు దూరంగా ఉండాలి, శారీరక సంబంధాలను కూడా నివారించాలి


ఇది కూడా చదవండి:

Zodiac Signs: ఈ రాశి వారికి అనుకోని ‘ఆర్థిక చిక్కులు’

Radha Raman Lal temple : ఆ దేవాలయంలో అగ్గిపెట్టె అవసరం లేదు..!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 07:23 AM

Advertising
Advertising