Share News

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:40 PM

వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడా పందిళ్లే పందిళ్లు. చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా అంతా ఒక్కటై.. పందిళ్లు ఏర్పాటు దగ్గర నుంచి ప్రసాదం పంపిణి చేసే వరకు కలిసిపోయి పని చేస్తారు. ఇక విద్యార్థులు అయితే చదువులో అడ్డంకులు తొలగిపోవడానికి వినాయకుడిని పూజిస్తారు.

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడా పందిళ్లే పందిళ్లు. చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా అంతా ఒక్కటై.. పందిళ్లు ఏర్పాటు దగ్గర నుంచి ప్రసాదం పంపిణి చేసే వరకు కలిసిపోయి పని చేస్తారు. ఇక విద్యార్థులు అయితే చదువులో అడ్డంకులు తొలగిపోవడానికి వినాయకుడిని పూజిస్తారు. అందులోభాగంగా ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్టించి.. ఆయన విగ్రహం వద్ద తాము చదువుకునే పుస్తకాలను పెడతారు. గణపతి పూజ సమయంలో ఆ పుస్తకాల ముందు పేజీలకు పసుపుతో ‘స్వస్తిక్’ గుర్తు పెడతారు. అలా కాకుంటే ‘ఓం’ అని పసుపుతో దిద్దుతారు. దానిపై కుంకుమతో బొట్టు పెడతారు. మరి వినాయక చవితి రోజు.. విద్యార్థులు చేపట్టే కొన్ని ప్రత్యేక పనులు వారి జ్జానం తెలివి తేటలను పొందడానికి సహాయపడతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు.


vinayaka-1.jpg

ఉదయాన్నే నిద్ర లేచి..

భాద్రపద శుద్ద చతుర్థి రోజు విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేవాలి. అనంతరం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత గణపతి విగ్రహం లేదా ఆయన చిత్ర పటం ఎదుట అవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలా వినాయకుడి ముందు కూర్చుని ఏకాగ్రతతో ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించాలి. అది కూడా 108 సార్లు కదల కుండా ఒకే ఆసనంపై కూర్చుని జపించాలని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ మంత్రం విద్యార్థుల బుద్ధికి పదును పెట్టడమే కాకుండా.. వారిలో ఏకాగ్రత స్థాయిని పెంచడంలో అత్యంత ప్రభావశీలంగా పని చేస్తుందని వివరిస్తున్నారు.


vinayaka-2.jpg

వినాయకుడు.. గరిక..

గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో గరిక ఒకటి. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున.. విఘ్నేశ్వరుడికి విద్యార్థులు 21 గరికలు సమర్పించాలి. విద్యార్థులు గరికలు సమర్పించడం వల్ల వినాయకుడు వెంటనే ప్రసన్నమవుతాడని చెబుతారు. దీంతో విద్యార్థులు కొరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని అంటారు. అంతేకాకుండా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత రావడంతో పాటు విజయాన్ని, శక్తిని ప్రసాదిస్తారని ఓ ప్రగాఢ విశ్వాసం.


vinayakudu-4.jpg

మోదకాలు నైవేద్యంగా పెట్టి.. అనంతరం..

వినాయకుడికి ఇష్టమైన వంటకాల్లో మోదకాలు ఒకటి. చవితి పర్వదినం రోజు వినాయకుడికి విద్యార్థులు మోదకం సమర్పించాలి. అనంతరం దానిని ప్రసాదంగా తీసుకోవాలి. విఘ్నేశ్వరుడికి మోదకాలు సమర్పించడం వల్ల ఆయన శీఘ్రమే ప్రసన్నమై.. మన కోర్కెలు తీరుస్తాడని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


vianayaka05.jpg

అథర్వ శీర్షం చదివితే.. ఆ తర్వాత..

ఇక చవితి పండగ రోజు.. విద్యార్థులు వినాయక అథర్వ శీర్షం పఠించాలి. ఇది అత్యంత పవిత్రమైనది. అంతేకాదు ఫలవంతమైనదని కూడా పెద్దలు విశ్వసిస్తారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఈ అథర్వ శీర్షం పఠించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగి చదువులో రాణిస్తారని అంటారు. అలాగే చదువులో మంచి మార్కులను సైతం సాధిస్తారని చెబుతారు.


vinayaka-6.jpg

కుంకుమ పెట్టి పూజ చేస్తే..

వినాయకుడికి ఇష్టమైన వాటిలో కుంకుమ కూడా ఒక్కటి. ఈ పండగ రోజు.. వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి కుంకుమ పెట్టాలి. అలాగే వినాయకుడిని కుంకుమతో ఆర్చించాలి.


vianayaka-06.jpg

వినాయకుడిని ధ్యానించి.. చదువు ప్రారంభిస్తే..

విద్యార్థులు చదువు ప్రారంభించే ముందు వినాయకుడిని ధ్యానించాలి. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది. దీంతో క్లిష్టమైన విషయాలను సైతం చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వినాయక చవితి రోజు ఇలా అభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..

Ganesh Chaturthi: వినాయక చవితికి ఎలాంటి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?


Ganesh Chaturthi 2024: లంబోదరుడి పూజలో 21 రకాల ఆకుల ప్రత్యేకత.. నిమజ్జనం ఎందుకు చేస్తారు


Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..


Ganesh Chaturthi: వినాయకుడి వ్రత కథ.. వింటే కోటి జన్మల పుణ్యం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 04 , 2024 | 04:41 PM