విధుల నుంచి తొలగించవద్దు...
ABN, Publish Date - Sep 03 , 2024 | 11:12 PM
వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాన టీచింగ్ స్టాఫ్ ఉద్యోగుల వేడుకోలు
చెన్నూరు, సెప్టెంబరు 3: వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమను ఆ యూనివర్సిటీ వీసీ తొలగిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం యూనివర్సిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్‌కు చెందిన షేక్ రబీవుల్లా మాట్లాడుతూ తమను ఈ ఏడాది మార్చిలో అవుట్‌సోర్సింగ్ కింద 47 మందిని తీసుకున్నారని, అయితే జూలై వరకు జీతాలు చెల్లించి ఆగస్టులో తొలగిస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. తామంతా పేదలమని, మాలో కొందరు వికలాంగులు ఉన్నారన్నారు. పనిచేస్తేనే తమ జీవితాలు గడుస్తాయని.. ఏ కారణం చూపించకుండా తమను తొలగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. వైవీయూ, డాక్టర్ బీఆర్ యూనివర్శిటీ, పులివెందుల, కడప రిమ్స్ కళాశాలలో తమలాగే ఉద్యోగులు పనిచేస్తున్నా వారిని తొలగించలేదని.. కేవలం ఇక్కడ మాత్రమే తొలగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇంటర్వ్యూద్వారా ఈ ఏడాది మార్చి 15న తీసుకున్న తమను ఇలా తీసేస్తామని చెప్పడం తగదని.. ఈ విషయంలో తాము ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు వినతిపత్రతాలు పంపుతామని తెలిపారు.
Updated Date - Sep 03 , 2024 | 11:12 PM