ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Liberation day: ప్రజా పాలన దినోత్సవంపై అభ్యంతరం

ABN, Publish Date - Sep 16 , 2024 | 10:22 PM

సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ విమోచన దినోత్సవం' అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 'జాతీయ సమైక్యతా దినం' అంటే ఇప్పటి రేవంత్ సర్కారేమో 'ప్రజా పాలన దినోత్సవం' అంటోంది. 'విమోచన' అనడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటి? హైదరాబాద్ పాతబస్తీ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ, దాని అధినేతలు ఓవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారు అని బీజేపీ లక్ష్మణ్ నిలదీశారు.

Dr Laxman

సెప్టెంబర్ 17 న ఆధికారికంగా విమోచన వేడుకల కోసం బిజెపి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది. 1998 నుంచే ఇందుకు ఉద్యమాలు చేశాం, ప్రజలను చైతన్యపరిచి, మరుగున పడేసిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ విమోచన యాత్రలు చేసాం. అమరవీరుల చరిత్రను వెలికితీసాం. చరిత్రాత్మక ప్రాంతాలను సందర్శించాం. అమరధామాలు నిర్మించాం. 2022 లో తొలిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు నిర్వహించుకున్నాం.


'తరతరాల బూజు' పోవడం విమోచన కాదా?

సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ విమోచన దినోత్సవం' అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 'జాతీయ సమైక్యతా దినం' అంటే ఇప్పటి రేవంత్ సర్కారేమో 'ప్రజా పాలన దినోత్సవం' అంటోంది. 'విమోచన' అనడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటి? హైదరాబాద్ పాతబస్తీ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ, దాని అధినేతలు ఓవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారు? వారిని ప్రసన్నం చేసుకునేందుకు చరిత్రనే వక్రీకరిస్తారా ? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలవద్దూ?


రైతులు, కూలీలు, సబ్బండ వర్ణాలు ఏకమై కత్తులు, గొడ్డళ్లు, వడిసెలు, బరిసెలు, బర్మారు తుపాకులు, రోకలిబండలు ఇత్యాది ఆయుధాలతో ప్రాణానికి తెగించి పోపోరాడిన చరిత్రను ఇప్పటి తరానికి తెలియకుండా ఎందుకు తొక్కిపెడుతున్నారు? హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడవ నిజాం ప్రయత్నించలేదా? కుదరని పక్షంలో పాకిస్థాన్ తో నైనా కలవాలని భావించలేదా? కరడుకట్టిన మతోన్మాది ఖాశిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపైకి ఉసిగొల్పిన నిజం దుష్ట చరిత్రను మరచిపోయారా? మనుషులను వరసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు, చెట్టుకు కట్టి సామూహికంగా ఉరితీయడాలు, సజీవ దహనాలు, మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు... ఇవన్నీ రజాకార్ల అకృత్యాలు కావా?


'మా నిజాం రాజు తరతరాల బూజు..' అని దాశరధి ఈసడించడంలో నిజం లేదూ? - 'గోల్కొండ ఖిలా కింద నీ ఘోరి గడ్డం కొడుకో నైజాము సర్కరోడా ' అన్న పాట అబద్ధమా? "రాజు పేరిట ఆరాజకమునకు జరిగిన పూజలు చాలింక - రక్కసితనముకు పిశాచవృత్తికి దొరికిన రక్షణ చాలింక అని కాళోజీ గర్జించింది. నిజాంకు వ్యతిరేకంగా కాదా? మరి ఎందుకు వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు? దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్, కొమురం భీం వంటి వారి పోరాటాలు ఈ తరం మరచిపోవాలా.?


కొందరు విద్రోహ దినం అంటున్నారు! ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాంను ఓడించడం విద్రోహమా? ఇది విలీనం కాదు, విద్రోహం కాదు.. ముమ్మాటికి విమోచనే. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవంగా నిర్వహిస్తే సంతోషమే. ఇది బిజెపి విజయం, తెలంగాణ ప్రజల విజయం.

హైదరాబాద్ సంస్థానంలో భాగమై ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలో విలీనమైన జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మాత్రం అధికారిక భాగ్యం లేదు. దీనికి కారణం ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలు, ఓవైసీకి భయపడడం. సెప్టెంబర్ 17 న అధికారికంగా విమోచన వేడుకల కోసం బిజెపి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది. 1998 నుంచే ఇందుకు ఉద్యమాలు చేశాం. ప్రజలను చైతన్యపరిచి, మరుగున పడేసిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ విమోచన యాత్రలు చేసాం. అమరవీరుల చరిత్రను వెలికితీసాం. చరిత్రాత్మక ప్రాంతాలను సందర్శించాం. అమరధామాలు నిర్మించాం.


అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు విస్మరించారు. ఉపేక్షించారు. తెలంగాణ తెచ్చుకున్నాకయినా అధికారిక వేడుకలు నిర్వహించుకుందామంటే అప్పటి సీఎం కేసీఆర్ నిరాకరించారు.. అదే కేసీఆర్. ఉద్యమ సమయంలో 'విమోచన దినోత్సవం' ఎందుకు నిర్వహించరని నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులను నిలదీశారు. స్వయంగా ఆయనే సీఎం అయినా, మజ్లిస్ కు భయపడి సెప్టెంబర్ 17 ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించలేదు.. అధికారిక వేడుకల కోసం 'తెలంగాణ విమోచన యాత్ర' పేరిట నేను స్వయంగా తెలంగాణవ్యాప్తంగా తిరిగి, ఉద్యమాల్లో పాల్గొన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా సరే, మేం అధికారిక వేడుకలు నిర్వహిస్తామని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. 2022 లో తొలిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. అమరవీరులను స్మరించుకున్నారు. వారి త్యాగాలను కీర్తించారు.


దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం పాలకుడు నిజాం నవాబు. ఈ ప్రాంతాన్ని స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా, లేకుంటే పాకిస్థాన్ తో కలవాలని భావించారు.. దీనికితోడు నియంతృత్వ నిజాం పాలనలో రజకార్ల దారుణాలు, అరాచకాలు, ఆకృత్యాలకు ఇక్కడి ప్రజలు నలిగిపోతూ ఉండడంపై నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ కలత చెందారు.. మంచిమాటలతో నిజాంను దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు. నిజాం ససేమిరా అనడంతో 'ఆపరేషన్ పోలో' పేరిట పోలీస్ యాక్షన్ కు శ్రీకారం చుట్టారు.. జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత సైనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో నిజాం సైన్యం, రజాకార్లు తోకముడిచారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవడం పటేల్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మేమే సాయుధ పోరాటం చేశామని కమ్యూనిస్టులు గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా అందుబాటులో ఉన్న పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని నిజాం, రజాకార్లపై పోరాడారు. ప్రజల స్వచ్చంద పోరాటాన్ని కమ్యూనిస్టుల హైజాక్ చేశారు. కమ్యూనిస్టులు నిజంగానే నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే నిజాం లొంగిపోయాక కూడా భారత బలగాలతో ఎందుకు పోరాడారు.? అంటే వారి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా కాదు, నిజాం నుంచి స్వాధీనం చేసుకొని రష్యాకు అనుబంధంగా ఇక్కడ స్వతంత్ర కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలనేది వారి కుట్ర. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేది వారి ఉద్దేశ్యం కానేకాదు. నిజాం లొంగిపోయాక భారత సైన్యాలతో పోరాటం చేయడం చరిత్రాత్మక తప్పిదంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అభివర్ణించడం

వాస్తవం కాదా.? ఇప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడినట్టు చెప్పుకోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. ఇప్పుడు మూడోసారి.. అదీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది... సెప్టెంబర్ 17 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది. 2022 లో మోదీ సర్కార్ ముందుకు వచ్చేసరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ అధికారిక వేడుకలకు సిద్ధమయ్యారు. అప్పుడు కూడా విమోచన అనకుండా 'జాతీయ సమైక్యతా దినం' అంటూ తప్పుదోవ పట్టించారు... ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్.. ఈ మూడు పార్టీలు ఒక్కటే, బిజెపి ఒక్కటే తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతోంది.

డా. కె. లక్ష్మణ్, ఎంపీ

బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

Updated Date - Sep 16 , 2024 | 10:23 PM

Advertising
Advertising